జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదల..
ABN , Publish Date - Jun 01 , 2026 | 08:13 AM
జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు ఆదివారం రాత్రి విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చని ఐఐటీ రూర్కీ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు ఆదివారం రాత్రి విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చని ఐఐటీ రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 సాధించి టాపర్‌గా నిలిచారు. కబర్ చిల్లర్-329, జతిన్ చాహర్-319 మార్కులతో వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.
మే 17న నిర్వహించిన పరీక్షలకు మెుత్తం 1,87,389 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. 1,79,694 మంది పేపర్ 1, 2 పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 56,880 మంది అర్హత సాధించగా.. వారిలో 10,107 మంది విద్యార్థినులు ఉన్నారు. అర్హత సాధించిన విద్యార్థులంతా JoSAA 2026 కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకావాలని ఐఐటీ రూర్కీ తెలిపింది.
ఫలితాలు ఎలా చూసుకోవాలంటే..
జేఈఈ jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
స్కోర్‌కార్డ్ కోసం 'ప్రకటనలు' విభాగం కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి
మీ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్‌ని నమోదు చేయండి
మీ ఫలితం, ర్యాంక్ వివరాలు కనిపిస్తాయి
భవిష్యత్తు ఉపయోగం కోసం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
ఈ వార్తలు కూడా చదవండి
మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు
ఎంబీబీఎస్ కోర్సు వ్యవధిపై ఎన్‌ఎంసీ కీలక ప్రతిపాదన