మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు
ABN , Publish Date - May 30 , 2026 | 01:09 PM
సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఏటా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి.
సంగారెడ్డి: సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఏటా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సంగారెడ్డిలోని పాఠ్యపుస్తకాల గోదాముకు 90 శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్న విషయం తెలిసిందే. వాటిని మండల పాయింట్లకు సరఫరా చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు ఐదు మండలాలకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేశారు.
ఈసారి జిల్లాకు 9,70,270 లక్షల పుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 1,23,900 పుస్తకాలు మండల పాయింట్లకు సరఫరా చేశామని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి పాఠశాలల పున:ప్రారంభం నాటికి విడతలవారీగా స్కూల్ పాయింట్లకు చేరవేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బ్రో... జాగ్రత్త..! సోషల్ మీడియాలో రెచ్చగొడితే జైలుకే
15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే
Read Latest AP News And Telangana News And International News And Telugu News