కొలువు తెచ్చిన గౌరవం..!
ABN , Publish Date - May 30 , 2026 | 11:36 AM
హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురవుతున్న పార్కులు, చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా.. పలువురు ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది.
‘హైడ్రా’లో ఉద్యోగంతో ట్రాన్స్‌జెండర్లలో ఆత్మవిశ్వాసం
ఈగల్ టీమ్‌గా పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురవుతున్న పార్కులు, చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా.. పలువురు ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఈ మేరకు సంస్థలో ఉద్యోగం కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించడంలో భాగంగా మొత్తం 16 మందికి హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్‌లు ఉండగా.. ఐదుగురు ట్రాన్స్‌మెన్‌లు ఉన్నారు. హైడ్రాలో తమకు దక్కిన ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని.. తమ జీవితాలకు కొత్త గుర్తింపు అని వారు చెబుతున్నారు. ఎక్కడైనా.. ఎప్పుడైనా విధులు నిర్వహించేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. హైడ్రా యూనిఫామ్ వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.
హైడ్రా ఈగల్ టీమ్‌గా సేవలు..
సంస్థలో చేరిన ట్రాన్స్‌జెండర్ల బృందానికి ఈగల్ టీమ్‌గా నామకరణం చేశారు. ఇటీవల అమీన్‌పూర్ మండలంలోని ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో వీరు చురుకైన పాత్ర పోషించారు. అలాగే మాదాపూర్‌లో ఈదులకుంట కాపాడడంలో సమర్థవంతమైన పాత్ర పోషించారు.
మా జీవితాల్లో వెలుగులు: గాయత్రి
మా జీవితాల్లో డబ్బుకంటే గౌరవమే ముఖ్యమైంది. ఇప్పుడు హైడ్రా యూనిఫాం వేసుకుని బయటికి వెళ్తే గౌరవంగా ఉంది. అది మా జీవితంలో పెద్ద మార్పు. అవకాశం ఇస్తే ట్రాన్స్‌జెండర్లు ఏ రంగంలోనైనా రాణిస్తారు. హైడ్రాలో మా విధులు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. విధులు నిర్వహణలో అందరూ సమానంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రికి, హైడ్రా కమిషనర్‌కు ధన్యవాదాలు.
ఈ వార్తలు కూడా చదవండి:
లింగంపల్లి ఆర్‌ఓబీ పనులకు మోక్షం
15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే
Read Latest AP News And Telangana News And International News And Telugu News