Home » Transgenders
అమెరికాలో సుదీర్ఘ కాలంగా సాగుతున్న సాంస్కృతిక, క్రీడా వివాదానికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెరదించింది. క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనకుండా పలు రాష్ట్రాలు విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురవుతున్న పార్కులు, చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా.. పలువురు ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది.
ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. ట్రాన్స్‌జెండర్స్‌కి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్స్ గ్రూపుల మధ్య వివాదం ఇద్దరు మృతికి కారణమైంది. ఏదో భయపెట్టేందుకో లేదా మరోదానికో ట్రాన్స్ జెండర్స్ వంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. అయితే, శరీరానికి తీవ్ర కాలిన గాయాలు కావడంతో..
హైదరాబాద్ మెట్రోలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ నియామక పత్రాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.
సమాజంలో ఇన్నాళ్లూ వివక్షకు గురైన వారికి ఇప్పుడు చేయూత లభిస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు వారిలో ఇంకొందరు సిద్ధమవుతున్నారు.
ట్రాన్స్‌జెండర్స్‌కి స్వావలంబన చేకూర్చడానికి, సమాజంలోని ప్రధాన స్రవంతితో వాళ్లని మమేకం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. నైపుణ్యాల ఆధారంగా శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాది కోసం వారికి రుణ సహాయం కూడా..
రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లు కొంతమంది ట్రాఫిక్ పోలీసు ఫోర్స్ అసిస్టెంట్లుగా నియామకమై వెంటనే విధులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్‌జెండర్లను కుటుంబసభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.