Share News

Transgenders in Hyderabad Metro: ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవం.. రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:01 PM

హైదరాబాద్ మెట్రోలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ నియామక పత్రాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.

Transgenders in Hyderabad Metro: ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవం.. రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Transgenders in Hyderabad Metro

హైదరాబాద్,సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)లో 20 మంది ట్రాన్స్‌జెండర్ల (Transgenders)ను సెక్యూరిటీ గార్డులుగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Government). ఈ క్రమంలో మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 నుంచి 400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.


ఆదర్శంగా నిలవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Adluri-Laxman.jpg

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతికి, వారు ఆత్మగౌరవంతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంకల్పించారని.. ఈ నేపథ్యంలోనే వీరిని నియమించారని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామని ఉద్ఘాటించారు. వారు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇతర ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పుకొచ్చారు. వీరు ఈ సమాజానికి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలని తెలిపారు. ట్రాన్స్‌జెండర్‌లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్రూప్‌-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు: ర్యాంకర్ల తల్లిదండ్రులు

శాసన మండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి హైకోర్టు షాక్

For More TG News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 05:41 PM