Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రోజుకో కొత్త ట్విస్ట్
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:05 PM
మరికొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో నియోజకవర్గంలో రాజకీయాల్లో రోజుకొక్క ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో జూబ్లీహిల్స్‌లో రాజకీయం రోజుకో కొత్త ట్విస్ట్ తెరపైకి వస్తోంది. తాజా ఈ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. బీసీ నినాదానంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సమాచారం. అలాగే ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు బరిలోకి దిగేందుకు సన్నాహాకాలు చేస్తున్నాయి.
బీఆర్ఎస్ మళ్లీ జూబ్లీహిల్స్ స్థానాన్ని తామే కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను బరిలోకి దింపేందుకు సన్నాహాకాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని డివిజన్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వరుసగా సమావేశమవుతూ.. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే జనంలోకి వెళ్లి.. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు ఎలా మంగళం పాడిందో వివరించాలంటూ కేటీఆర్ ఇప్పటికే సోదాహరణగా వివరించారు.
ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభావం త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ క్రమంలో నియోజకవర్గ నేతలు, పార్టీ నేతలతో ఆయన ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చేయాలని ఈ సందర్భంగా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదీకాక.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం ప్రణాళికులు సిద్ధం చేస్తున్నారు. ఇక కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. దీంతో ఆమె సైతం ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ జాగృతి తరుఫున ఆమె సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదనే ఒక ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శాసన మండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి హైకోర్టు షాక్
For More TG News And Telugu News