Jaya Mangala Venkata Ramana: శాసన మండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి హైకోర్టు షాక్
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:03 PM
ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ రాజీనామా ఆమోదించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ తరపు న్యాయవాదికి మంగళవారం ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది.
అమరావతి, సెప్టెంబర్ 16: ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ రాజీనామా ఆమోదించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ తరపు న్యాయవాదికి మంగళవారం ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలంటే అందుకు ఖర్చుల కింద రూ.10 చెల్లించాలంటూ సదరు న్యాయవాదిని ఈ కేసు విచారిస్తున్న జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు లీగల్ సర్వీస్ అథారిటీకి ఈ నగదు చెల్లింపులు జరగాలంటూ శాసన మండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
జయమంగళవెంకట రమణ..తొలుత టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ కొద్ది నెలలకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కేటాయించి.. శాసన మండలికి పంపారు. అనంతరం తనకు విలువ ఇవ్వడం లేదంటూ 2024, నవంబర్‌లో తన ఎమ్మెల్సీ పదవితోపాటు వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. ఆ లేఖను శాసన మండలి చైర్మన్ కె. మోషేజ్ రాజుకు స్వయంగా అందజేశారు. కానీ ఆ లేఖను చైర్మన్ ఆమోదించ లేదు.
ఈ నేపథ్యంలో తన రాజీమానా లేఖను ఆమోదించేలా శాసన మండలి చైర్మన్‌ను ఆదేశించాలంటూ జయమంగళ వెంకట రమణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తమకు కొంత సమయం ఇవ్వాలంటూ శాసన మండలి చైర్మన్ తరఫు న్యాయవాది కోర్టుకు కోరారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని.. మరింత సమయం అంటే ఎలా అంటూ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మరింత సమయం అంటే.. ఖర్చుల కింద రూ. 10 వేలు చెల్లించాలంటూ సదరు న్యాయమూర్తిని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డెంగ్యూ జ్వరం దరి చేరకూడదంటే.. సింపుల్ చిట్కాలు
మళ్లీ గ్రహణం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్
For More AP News And Telugu News