Share News

Tips To Prevent Dengue Fever: డెంగ్యూ జ్వరం దరి చేరకూడదంటే.. సింపుల్ చిట్కాలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:22 PM

దోమల వల్ల వచ్చే డెంగ్యూ జర్వంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటిని నివారించేందుకు సింపుల్ చిట్కాలు ఉన్నాయి.

Tips To Prevent Dengue Fever: డెంగ్యూ జ్వరం దరి చేరకూడదంటే.. సింపుల్ చిట్కాలు
Tips To Prevent Dengue Fever

ప్రస్తుతం ఎక్కడ చూసిన వైరల్ ఫీవర్లు, డెంగ్యూ జర్వాలే. వీటి బారిన పడిన ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అయితే వైరల్ ఫీవర్లంటే.. నీటి ద్వారా వస్తాయి. లేదంటే.. ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. కానీ డెంగ్యూ జర్వం అలా కాదు. దోమలు కుట్టడం వల్ల వస్తుంది. దేశంలో ఈ ఏడాది ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా 49 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయని.. ఈ జర్వం కారణంగా 42 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తాజాగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. మరి ముఖ్యంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ కేసుల తీవ్రత అధికంగా ఉందంటూ ఆయన ఆందోళన సైతం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా ప్రభుత్వాలకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.


అయితే డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..

రిపెల్లెంట్లు వినియోగించాలి..

డెంగ్యూ జ్వరాలు కలిగించే దోమలు.. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ దోమలు కుట్టుకుండా ఉండేందుకు రిపెల్లెంట్లను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని చర్మంపై రాసుకోవాలి. తద్వారా డెంగ్యూ దోమలు కుట్టకుండ ఉంటాయి.


దుస్తులు ధరించడం ద్వారా..

శరీరంలోని కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఇంకా చెప్పాలంటే.. శరీరం మొత్తం దుస్తులతో కప్పి ఉంచాలి. అలాగే లైట్ కలర్స్ ఉన్న దుస్తులు ధరించాలి. దీంతో డెంగ్యూ దోమల నుంచి రక్షించుకోవచ్చు. ఇక ముదురు రంగు దుస్తులు ధరించినట్లు అయితే.. వాటిని దోమలు ఆకర్షిస్తాయి. అందువల్ల సాదా రంగుల్లో ఉన్న దుస్తులను ధరించడం అత్యత్తమం.


వలలు, మెష్‌లను ఏర్పాటు చేసుకోవాలి..

ముఖ్యంగా ఇళ్లలోకి దోమలు రాకుండా చూసుకోవాలి. అందుకోసం ఇళ్లలో కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తలుపులకు రక్షణగా స్క్రీన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక బెడ్ రూమ్‌లో సైతం దోమ తెరను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇళ్లలో దోమలు అధికంగా ఉంటే.. ఈ తరహా చర్యలు పటిష్టంగా చేపట్టాల్సి ఉంటుంది.


నిలిచిన నీరు తొలగించండి

ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచి ఉంటే.. అందులో దోమ లార్వాను పెడుతోంది. దీంతో దోమల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖాళీ కంటేయినర్లు, పూల కుండీలు, వాటర్ కూలర్స్, బకెట్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఒక వేళ.. నీరు నిల్వ ఉంటే.. వాటిని వెంటన ఖాళీ చేసి.. శుభ్రం చేయాలి.


పరిసరాలను శుభ్రంగా..

మరి ముఖ్యంగా పరిసరాలను పరిశ్రుభం‌గా ఉంచుకోవాలి. అంటే.. పరిసరాల్లో ఖాళీ సీసాలు లేకుండా చూడాలి. ఒక వేళ అవి ఉంటే.. వాటిని చెత్తలో పడేయాలి. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి.


కాయిల్స్, వేపరైజర్స్ వినియోగించాలి

మస్కిటో కాయిల్స్, వేపరైజర్‌లను విరివిగా వినియోగించాలి. తలుపులు మూసి.. ఈ కాయిల్స్, వేపరైజర్‌లను వెలిగించాలి. అది కూడా దోమలు అత్యధికంగా ఉండే సమయంలోనే మాత్రమే వీటిని వినియోగించాల్సి ఉంటుంది.

Updated Date - Sep 16 , 2025 | 12:32 PM