Share News

Group-1 Exam Controversy: గ్రూప్‌-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు: ర్యాంకర్ల తల్లిదండ్రులు

ABN , Publish Date - Sep 16 , 2025 | 04:27 PM

గ్రూప్‌-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పలు పార్టీ నేతల రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని సూచించారు.

Group-1  Exam Controversy: గ్రూప్‌-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు: ర్యాంకర్ల తల్లిదండ్రులు
Group-1 Exam Controversy

హైదరాబాద్,సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పరీక్షల వివాదాన్ని(Group-1 Exam Controversy) రాజకీయం చేయొద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు (Rankers Parents) పేర్కొన్నారు. పలు పార్టీ నేతల రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని సూచించారు. రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారనే ఆరోపణలు సరికాదని చెప్పుకొచ్చారు. అసత్య ఆరోపణలు తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ర్యాంకర్ల తల్లిదండ్రులు ఓ ప్రకటన విడుదల చేశారు.


గ్రూప్‌-1 పరీక్షలపై ఆరోపణలు చేసే వారు వాటిని నిరూపించాలని ర్యాంకర్ల తల్లిదండ్రులు సవాల్ చేశారు. గ్రూప్‌-1 పోస్టులు కొన్నామన్న ప్రచారంతో తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఈ పోస్టులు కొన్నామన్న ఆరోపణలపై విచారణకు తాము సిద్ధమని ర్యాంకర్ల తల్లిదండ్రులు ఛాలెంజ్ చేశారు. కొంతమంది రాజకీయ నేతలు కోర్టు తీర్పు వచ్చాకే గ్రూప్‌-1 పోస్టులు కొన్నామని ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు ర్యాంకర్ల తల్లిదండ్రులు.


పరీక్షలు మళ్లీ రాయాలంటే ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని తెలిపారు. కష్టపడి, పస్తులు ఉండి అప్పులు చేసి పిల్లలను చదివించామని వివరించారు. సమాజం పట్ల చిన్న చూపు చూసే పరిస్థితి ఏర్పడుతోందని ర్యాంకర్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శాసన మండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి హైకోర్టు షాక్

For More TG News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 04:33 PM