Share News

Transgender Community: ట్రాన్స్‌జెండర్స్‌కి గుడ్ న్యూస్

ABN , Publish Date - Jun 26 , 2025 | 07:57 PM

ట్రాన్స్‌జెండర్స్‌కి స్వావలంబన చేకూర్చడానికి, సమాజంలోని ప్రధాన స్రవంతితో వాళ్లని మమేకం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. నైపుణ్యాల ఆధారంగా శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాది కోసం వారికి రుణ సహాయం కూడా..

Transgender Community: ట్రాన్స్‌జెండర్స్‌కి గుడ్ న్యూస్
Transgender Community

లక్నో, జూన్ 26: ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి స్వావలంబన చేకూర్చడానికి, సమాజంలోని ప్రధాన స్రవంతితో వాళ్లని మమేకం చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లను 'సీఎం యువ అభియాన్‌' స్కీమ్‌తో అనుసంధానించబోతుంది. ఈ పథకం ద్వారా వారికి నైపుణ్యాల ఆధారంగా శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాది కోసం రుణ సహాయం కూడా అందించబోతున్నారు. తద్వారా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, వారిని సమాజంలో నిర్ణయాత్మక పాత్ర పోషించేలా చేసేందుకు యోగి సర్కారు ఈ చర్యలు చేపట్టింది.


అంతకుముందు, ఘజియాబాద్‌లోని సాహిబాబాద్‌లో CEL-ESDS గ్రీన్ డేటా సెంటర్‌కు సీఎం యోగి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ శంకుస్థాపన చేశారు. CEL అభివృద్ధి చేస్తున్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2070 నాటికి జీరో ఉద్గారాలను సాధించాలనే ప్రధానమంత్రి మోదీ లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఒక బలమైన అడుగుగా సీఎం అభివర్ణించారు.

2027 నాటికి ఉత్తరప్రదేశ్ 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని, ఈ మిషన్‌లో CEL కీలక పాత్ర పోషిస్తుందని కూడా సీఎం అన్నారు. ఘజియాబాద్‌లో జరిగిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (CEL) స్వర్ణోత్సవ వేడుకలో, దాని కొత్త డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం యోగీ 'ఏక్ పెడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా ఒక మొక్కను కూడా నాటారు.

cm-yogi.jpg


ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 26 , 2025 | 08:00 PM