Home » Yogi Adityanath
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్ఈడీ వెలుగుల్లో మెరిసిపోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మద్దతుతో ఆర్జేడీ పాలన సాగించినప్పుడు పేదలను పట్టించుకోలేదని, రేషన్, ప్రభుత్వ స్కీములు దక్కనీయలేదని యోగి అన్నారు. 2005కు ముందు కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో పేద ప్రజలు జబ్బు పడితే కనీస వైద్య సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోయే వారని తెలిపారు.
ఇటీవల తాను వచ్చినప్పుడు ఇక్కడి గ్రామం పేరు ముస్తఫాబాద్ అని తనకు చెప్పారని, ఎంతమంది ముస్లింలు నివసిస్తున్నారని తాను అడిగినప్పుడు ఒక్కరు కూడా లేరని తనకు చెప్పారని యోగి వివరించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్, మహారాణా ప్రతాప్, మహారాణా సంగా వంటి వీరులు పొలిటికల్ ఇస్లామ్‌పై కీలక పోరాటం సాగించారని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేసారు. అయితే ఆ కోణాన్ని చరిత్ర పెద్దగా పట్టించుకోలేదన్నారు.
అయోధ్యకు రాముడు తిరిగి వచ్చినప్పటి సంబరాలను గుర్తుచేసుకుంటూ శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ వేషధారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హారతి ఇచ్చారు. సంప్రదాయకంగా పుష్పక విమాన్ రథాన్ని లాగారు.
యూపీలో 2017కు ముందు వ్యవస్థను నిలిపివేసే ట్రెండ్ నడిచిందని, కానీ 2017 తర్వాత నుంచి ఒక్క కర్ఫ్యూని కూడా తాము అనుమతించలేదని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అప్పటి నుంచే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కథ మొదలైందని వివరించారు.
యోగిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అష్ఫాక్ నిసార్ షేక్‌గా గుర్తించారు. చాలా రోజుల క్రితమే ఆయన ఈ హెచ్చరికలు చేసినప్పటికీ ఇటీవలే ఆ వీడియో విడుదలైంది.
పోలీసు స్టేషన్లు, వాహనాలు, సైన్బోర్డులపై ఉన్న కుల చిహ్నాలు, స్లోగన్లు, ప్రస్తావనలను వెంటనే తొలగించాలని కూడా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా, కుల ఆధారిత ర్యాలీలు నిషేధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉల్లంఘనలను కఠినంగా పరిశీలించాలని పోలీసులకు సూచనలు జారీ చేశారు.
ప్రధానమంత్రిగా ప్రస్తుతం నరేంద్రమోదీ ఉన్నారని భవిష్యత్తులో యోగీ ఆదిత్యనాథ్ వస్తారని అప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తప్పవని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె ఎందుకు థాంక్స్ చెప్పారు, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.