యోగి నిజమైన హిందువైతే.. అవిముక్తేశ్వరానంద్ స్వామి సవాల్
ABN , Publish Date - Jan 30 , 2026 | 09:36 PM
యోగి ఆదిత్యనాథ్‌పై అవిముక్తేశ్వరానంద స్వామి బహిరంగ యుద్ధం ప్రకటించారు. యోగి తాను హిందువునని నిరూపించుకోవాలని సవాలు చేశారు.
లక్నో: 'మాఘ మేళా'లో పవిత్రస్నానం కోసం రథంలో ఇటీవల వచ్చిన జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిని ఉత్తరప్రదేశ్ అధికారులు అడ్డుకున్నప్పటి నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందుత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన యోగి ఆదిత్యనాథ్‌పై బహిరంగ యుద్ధం ప్రకటించారు. యోగి తాను హిందువునని నిరూపించుకోవాలని సవాలు చేశారు. యోగి నిజమైతే హిందువైతే ఉత్తరప్రదేశ్‌లో 40 రోజుల్లోగా గోవుమాంసం (bovine meet) ఎగుమతిని నిషేధించి, రాజ్యమాతగా గోవును ప్రకటించాలని సవాలు చేశారు. ఆ విధంగా చేయలేకపోతే ఆయనను నకిలీ హిందువుగా అనుకోవాల్సి వస్తుందన్నారు.
'కాషాయం కట్టుకోవడం, ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన ఎవరూ హిందువు అయిపోరు. హిందూయిజంలో ముఖ్యమైనది గో సేవ, ధర్మాన్ని రక్షించడం' అని వారణాసిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. భారతదేశం ఎగుమతి చేస్తున్న బీఫ్‌లో 40 శాతం వాటా ఉత్తరప్రదేశ్‌దేనని, బీఫ్‌ను ఎగుమతి చేయడం ద్వారా రామరాజ్యం కలను నిజం చేయాలనకుంటున్నారా అని యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన ప్రశ్నించారు. గోవు మాంసాన్ని గొడ్డుమాసం కేటగిరి కింద ఎగుమతి చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై చర్చించేందుకు మార్చిలో సాధవులతో లక్నోలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. బీఫ్‌ను నిషేధిస్తూ యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయకుంటే ఆదిత్యనాథ్‌ను నకీలి హిందువుగా ప్రకటిస్తామని అన్నారు.
మాఘ మేళా సమయంలో తన శిష్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ అవిముక్తేశ్వరానంద్ ఇటీవల ధర్నా చేపట్టారు. ఇది నిజమైన హిందువుకూ, నకిలీ హిందువుకూ మధ్య యుద్ధం జరుగుతున్న యుద్ధంగా ఆదిత్యనాథ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మ వ్యతిరేకులకు అధికారంలో కూర్చునే అధికారం లేదన్నారు. కాగా, అవిముక్తేశ్వరానంద్ స్వామి ఆరోపణలను అధికాలు తోసిపుచ్చారు. మౌని అమావాస్య రోజున భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నందువల్లే ఆయనను రథంలో వెళ్లేందుకు అనుమతించలేదని వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. రేపు ప్రమాణస్వీకారం
అజిత్ పవార్ శాఖలపై సీఎంను కలిసిన ఎన్‌సీపీ నేతలు
For More National News And Telugu News