డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. రేపు ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Jan 30 , 2026 | 08:20 PM
అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన భార్య సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన భార్య, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్ (Sunetra Pawar) కొత్త డిప్యూటీ సీఎం కానున్నారు. ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ పగ్గాలు చేపడతారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసిన అజిత్ పవార్ చేతిలో ఆర్థిక, ప్రణాళిక, ఎక్సైజ్ శాఖలు కూడా ఉన్నాయి.
శనివారం ప్రమాణస్వీకారం..
ఎన్‌సీపీ వర్గాల సమాచారం ప్రకారం. ఎన్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం శనివారం జరుగుతుంది. ఈ సమావేశంలో సునేత్రను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అనంతరం ముంబై రాజ్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎంగా ఆమె ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరోవైపు, ఎన్‌సీపీ రెండు వర్గాలు (ఎన్‌సీపీ, ఎన్‌సీపీఎస్‌పీ) విలీనం అవుతాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. రెండు వర్గాలు ఏకం కావాలన్నదే అజిత్ పవార్ చివరి కోరిక అని అజత్ పవార్ సన్నిహితుడు కిరణ్ గుజర్ తెలిపారు. ఈ క్రమంలో అజిత్ పవార్ చేతిలోని కీలక శాఖలను తమ పార్టీకే కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎన్‌సీపీ కీలక నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బుల్ శుక్రవారంనాడు కలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఫిబ్రవరిలో ఎన్‌సీపీ వర్గాల విలీనం.. అధ్యక్ష పదవికి పోటీలో నలుగురు
అజిత్ పవార్ శాఖలపై సీఎంను కలిసిన ఎన్‌సీపీ నేతలు
For More National News And Telugu News