రివాల్వర్‌తో కాల్చుకుని.. కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ ఆత్మహత్య..
ABN , Publish Date - Jan 30 , 2026 | 07:58 PM
ఆదాయపు పన్ను శాఖ ఆయన కార్యాలయంపై దాడులు జరుపుతున్న సమయంలోనే డాక్టర్ సీజే రాయ్.. రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది.
బెంగళూరు: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ (Confident Group) వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ (CJ Rai) శుక్రవారం సెంట్రల్ బెంగళూరులోని తన కార్యాలయంలో ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆయన కార్యాలయంపై దాడులు జరుపుతున్న సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయన తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
ఘటన సమయంలో ఆయన తన కార్యాలయంలో ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణం ఏంటనేది కానీ, సూసైడ్ నోట్ విషయం కానీ వెంటనే తెలియలేదు. వివరాల కోసం రాయ్ వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆత్మహత్య కేసుగా రిజిస్టర్ చేసుకున్నామని, వాస్తవాలు వెల్లడయ్యేంత వరకూ ఎలాంటి వదంతులు సృష్టించవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
57 ఏళ్ల సీజే రాయ్ 2005లో కాన్ఫిడెంట్ గ్రూప్‌ను ప్రారంభించి కీలకమైన రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో వందలాది ప్రాజెక్టులు చేపట్టారు. యూఏఈలో కూడా వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్‌తో పాటూ మౌలిక సదుపాయాలు, ఆతిథ్యం, విద్య, విమానయానం, రిటైల్, వినోదం, అంతర్జాతీయ వాణిజ్య విస్తరణలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఫిబ్రవరిలో ఎన్‌సీపీ వర్గాల విలీనం.. అధ్యక్ష పదవికి పోటీలో నలుగురు
అజిత్ పవార్ శాఖలపై సీఎంను కలిసిన ఎన్‌సీపీ నేతలు
For More National News And Telugu News