ఫిబ్రవరిలో ఎన్‌సీపీ వర్గాల విలీనం.. అధ్యక్ష పదవికి పోటీలో నలుగురు
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:00 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు తిరిగి కలిసిపోయే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి.
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో మరణించడంతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) రెండు వర్గాలు తిరిగి కలిసిపోయే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. దీనిపై ఫిబ్రవరి రెండో వారంలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇరు పార్టీల (ఎన్‌సీపీ-ఎన్‌సీపీఎస్‌పీ) సీనియర్ నేతల సమాచారం ప్రకారం, విమాన ప్రమాదానికి మందు రెండు పార్టీల విలీనంపై అజిత్ పవార్ గత డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో పలు పర్యాయాలు తన బాబాయ్ అజిత్ పవార్‌తో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పవార్లు ఇరువురూ సంయుక్తంగా విలీనం ప్రకటన చేయాలని అనుకున్నారు. కాగా, వచ్చే వారంలో ఇరు పార్టీ నేతలు విలీనం ఖరారుపై చర్చించేందుకు సమావేశం కానున్నట్టు చెబుతున్నారు.
మరోవైపు, అజిత్ పవార్ ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన చెందిన కొందరు రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ తక్షణ విలీనాన్ని కోరుకోవడం లేదని, శరద్ పవార్ వర్గంలోని వారు మాత్రం తక్షణ విలీనాన్ని ఆశిస్తున్నారని తెలుస్తోంది. విలీనం ప్రక్రియలో సునేత్ర పవార్ కీలక పాత్ర పోషించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
శరద్ పవార్, మరో ముగ్గురు బరిలో..
కాగా, పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్న వారిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో శరద్ పవార్‌తో పాటు అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ వర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్ ఉన్నారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవిలో సునేత్ర పవార్‌ను నియమించాలని, లెజిస్లేచర్ పార్టీ నేత పగ్గాలు ఇవ్వాలని అజిత్ వర్గీయులు కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే సాంకేతిక పరమితులు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. ఎన్‌పీ నేత ప్రఫుల్ పటేల్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి ఎన్‌సీపీని ఏర్పాటు చేశారు. అయితే ఆయన మేనల్లుడు అజిత్ పవార్ 2023 జూలైలో తిరుగుబాటు చేసి అధికార మహాయుతి ప్రభుత్వంతో చేతులు కలిపారు. ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ కూడా అజిత్ క్యాంపులో చేరారు. అజిత్ పవార్ ఊహించని విధంగా గత బుధవారంనాడు విమాన ప్రమాదంలో మరణించారు. ఈ క్రమంలో ఎన్సీపీ వర్గాలు తిరిగి ఏకమవుతాయనే ప్రచారం జరిగింది. దీనిపై ఎన్‌సీపీ నేత అంకుష్ కాకడే మాట్లాడుతూ, శరద్ పవార్ పుట్టిన రోజైన డిసెంబర్ 12న రెండు వర్గాలను విలీనం చేసి ఆయనకు కానుగా ఇవ్వాలని అజిత్ పవార్ అనుకున్నారని, అయితే కారణాంతరాల వల్ల అది వెంటనే సాధ్యం కాలేదని చెప్పారు. వీలీనం విషయంపై జనవరి 16, 17 తేదీల్లో అజిత్ పవార్ ఉన్నత స్థాయి సమావేశం జరిపారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మేము అధికారంలో ఉన్నంత వరకూ సహించం.. రాహుల్‌కు అమిత్‌షా వార్నింగ్
చరిత్ర సృష్టించనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
For More National News And Telugu News