సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. ఆర్మీ హెచ్చరిక కాల్పులు
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:50 PM
ఎల్ఓసీ వెంబడి గగనతంలో పాక్ డ్రోన్‌లు కనిపించడంతో ఇండియన్ ఆర్మీ 06 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది వెంటనే వార్నింగ్ షాట్స్ పేల్చారు. దీంతో డ్రోన్‌లన్నీ వెనక్కి వెళ్లిపోయినట్టు అధికారులు చెప్పారు.
కుప్వారా: జమ్మూకశ్మీర్‌లోని కేరన్ సెక్టార్ జోధా మకాన్-బీరండోరి ప్రాంతంలోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి శుక్రవారం 15 డోన్లు సంచరించినట్టు గుర్తించారు. ఆర్మీ బలగాలు వెంటనే స్పందించినట్టు అధికారులు తెలిపారు.
ఎల్ఓసీ వెంబడి గగనతంలో పాక్ డ్రోన్‌లు కనిపించడంతో ఇండియన్ ఆర్మీ 06 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది వెంటనే వార్నింగ్ షాట్స్ పేల్చారు. దీంతో డ్రోన్‌లన్నీ వెనక్కి వెళ్లిపోయినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ జరగలేదని తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, పాక్ డ్రోన్ల కదలికల నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించి నిఘాను మరింతం తీవ్రం చేశామని అధికారులు వివరించారు.
రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, కేరన్ సెక్టార్‌లో గురువారం రాత్రి కొన్ని తక్కువ భూమి కక్ష (ఎల్‌ఈఓ) ఉపగ్రహాలు కనిపించాయి. రొటీన్ క్రమంలో సాయుధ బలగాలు ఓవరాల్ ఎయిర్‌స్పేర్ నిఘా కొనసాగిస్తున్నాయి. కాగా, ఈనెల మొదట్లో పూంచ్, సాంబాలోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి పాక్ డ్రోన్‌లు కనిపించారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. రామ్‌గఢ్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా ఒక డ్రోన్ కనపించిందని చెబుతున్నారు. దీంతో పాకిస్థాన్‌తో సరిహద్దు వెంబడి రక్షణ బలగాలు హైఅలర్ట్ కొనసాగిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
బాంబు బెదిరింపు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
చరిత్ర సృష్టించనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
For More National News And Telugu News