Share News

Yogi Govt Sensational Decision: మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లు రద్దు

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:58 PM

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అఖిలేష్‌ యాదవ్‌ హయాంలో తెచ్చిన మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే చట్టం రద్దు చేశారు. దీంతో మదర్సా సిబ్బందిపై అక్రమాలు వెలుగులోకి వస్తే నేరుగా చర్యలు తీసుకునే అధికారం..

Yogi Govt Sensational Decision: మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లు రద్దు
Yogi Adityanath

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 23: ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హయాంలో (2016లో) తీసుకొచ్చిన మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లు రద్దు చేసింది.

సదరు బిల్లు ప్రకారం, మదర్సా ఉపాధ్యాయులు లేదా సిబ్బందిపై ఎలాంటి అక్రమాలు (ఆర్థిక లోపాలు లేదా ఇతర నేరాలు) వెలుగులోకి వచ్చినా, పోలీసులు నేరుగా చర్యలు తీసుకోలేకపోయేవారు. ప్రత్యేక అనుమతులు అవసరమయ్యేవి. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సదరు చట్టం వారికి ఒక రకమైన రక్షణ కల్పించేది.


ఇప్పుడు ఈ బిల్లు రద్దుతో మదర్సా సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదు లేదా ఆధారాలు ఉన్నా పోలీసులు నేరుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవచ్చు. యోగి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని 'కాన్ సే ఉపర్ కోఈ వర్గ్ నహీ' (చట్టానికి ఎవరూ అతీతం కాదు) అనే సూత్రంతో సమర్థించింది.

ఈ మార్పు మదర్సాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇది మదర్సా విద్యావ్యవస్థలో జరిగే అక్రమాలను అరికట్టడానికి సహాయపడుతుందని యోగీ ప్రభుత్వం భావిస్తోంది.


ఇవీ చదవండి:

జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా దుల్కర్‌ సల్మాన్‌

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 23 , 2025 | 01:11 PM