Share News

Dulquer Salmaan: జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా దుల్కర్‌ సల్మాన్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:30 AM

భారత్‌లోని అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల సంస్థల్లో ఒకటైన జోస్‌ అలుక్కాస్‌.. తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ను నియమించుకుంది.

Dulquer Salmaan: జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా దుల్కర్‌ సల్మాన్‌

హైదరాబాద్‌: భారత్‌లోని అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల సంస్థల్లో ఒకటైన జోస్‌ అలుక్కాస్‌.. తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ను నియమించుకుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్‌ సల్మాన్‌ ప్రచారంతో జోస్‌ అలుక్కాస్‌ వినియోగదారులకు మరింత చేరువ కానుందని జోస్‌ అలుక్కాస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు వర్ఘీస్‌ అలుక్కాస్‌, పాల్‌ అలుక్కాస్‌, జాన్‌ అలుక్కాస్‌ తెలిపారు. జువెలరీ రంగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా ఉన్న జోస్‌ అలుక్కా్‌సకు ప్రచారం నిర్వహించటం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఈ సందర్భంగా దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 03:30 AM