Yogi Adityanath: పొలిటికల్ ఇస్లామ్‌తో యమ డేంజర్.. యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక
ABN , Publish Date - Oct 22 , 2025 | 06:17 PM
ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్, మహారాణా ప్రతాప్, మహారాణా సంగా వంటి వీరులు పొలిటికల్ ఇస్లామ్‌పై కీలక పోరాటం సాగించారని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేసారు. అయితే ఆ కోణాన్ని చరిత్ర పెద్దగా పట్టించుకోలేదన్నారు.
గోరఖ్‌పూర్: దేశానికి పొలిటికల్ ఇస్లామ్ (Political Islam) పెను ప్రమాదమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) హెచ్చరించారు. ఈ ముప్పుతో మన పూర్వీకులు పోరాడారని అన్నారు. అయితే దాని గురించి అంతగా చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు. చరిత్రలో బ్రిటిష్, ఫ్రెంచ్ వలసదారుల ప్రస్తావన ఉన్నప్పటికీ పొలిటికల్ ఇస్లామ్‌పై ప్రస్తావన చాలా తక్కువని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతజయంతి ఉత్సవాల్లో సీఎం బుధవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్, మహారాణా ప్రతాప్, మహారాణా సంగా వంటి వీరులు పొలిటికల్ ఇస్లామ్‌పై కీలక పోరాటం సాగించారని గుర్తు చేశారు. అయితే ఆ కోణాన్ని చరిత్ర పెద్దగా పట్టించుకోలేదన్నారు.
దేశాన్ని విడగొట్టేందుకే..
పొలిటికల్ ఇస్లామ్ ద్వారా దేశాన్ని విడగొట్టేందుకు చంగూర్ బాబా వంటి శక్తులను ఉపయోగించుకుంటారని, అలాంటి శక్తుల నుంచి రక్షించేందుకు సమాజాన్ని ఏకం చేసే కృషిని ఆర్ఎస్ఎస్ కొనసాగిస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న ప్రయత్నాలు ప్రశంసార్హమని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
హలాల్ సర్టిఫికేషన్..
మతమార్పిడులకు సిద్ధపడే వారికి కులం ఆధారంగా చాంగూర్ బాబా డబ్బులు ఆఫర్ చేసేవారని ఆదిత్యనాథ్ తెలిపారు. 'ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ విషయం మీకు కూడా తెలియదు. ఎక్కడో విదేశాల నుంచి ఆ సొమ్ములు రావడం లేదు. మీ నుంచే వస్తున్నాయి. మీరు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు దానిపై హలాల్ సర్టిఫికేషన్ ఉందా అనేది ముందుగా చూడండి. హలాల్ సర్టిఫికేషన్‌ను మేము ఉత్తరప్రదేశ్‌లో బ్యాన్ చేశాం. ఆశ్చర్యం ఏమిటంటే హలాల్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువుల్లో సబ్బులు, దుస్తులు, అగ్గిపెట్టెలు కూడా ఉన్నాయి' అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
కేంద్రం నుంచి కానీ.. రాష్ట్రం నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోకుండా హలాల్ సర్టిఫికేషన్ పేరుతో రూ.25,000 కోట్లు పోగు చేశారని, ఈ సొమ్మంతా ఉగ్రవాదం, లవ్ జిహాద్, మతమార్పిడులకు ఖర్చు చేస్తుంటారని యోగి వివరించారు. ఆ కారణంగా హలాల్ సర్టిఫికేషన్‌కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ నుంచే పెద్దఎత్తున ప్రచారం మొదలుపెట్టామని చెప్పారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎవరు తయారు చేశారో చూసుకోవాలని కోరారు. చాంగూర్ అలియాస్ జలాలుద్దీన్ ఒక ఉదాహరణ మాత్రమేనని, అలాంటి జలాలుద్దీన్‌లు మీ చుట్టూనే ఉంటారని, వాళ్లపై ఒక కన్నువేసి ఉండాలని ప్రజలకు సూచించారు.
హవాల్ సర్టిఫైడ్ ప్రోడెక్ట్ అంటే..
హలాల్ సర్టిఫైడ్ ప్రోడెక్ట్ అనేది ఇస్లామిక్ చట్టానికి లోబడి అందించే వస్తువు, సేవల కిందకు వస్తుంది. తద్వారా వచ్చే సొమ్ములను ముస్లింలకే ఉపయోగించాలి. ఇండియాలో హలాల్ సర్టిఫికేట్‌ను థర్ట్ పార్టీ సంస్థలు చేస్తున్నాయే కానీ, తప్పనిసరి కాదు.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి