Share News

Draupadi Murmu Sabarimala visit: అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

ABN , Publish Date - Oct 22 , 2025 | 02:02 PM

కేరళ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు చేరుకున్నారు. ఇరుముడితో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆరు కాన్వాయ్‌లతో ద్రౌపది ముర్ము శబరిమలకు చేరుకున్నారు.

Draupadi Murmu Sabarimala visit: అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
Draupadi Murmu Sabarimala visit

కేరళ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు చేరుకున్నారు. ఇరుముడితో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆరు కాన్వాయ్‌లతో ద్రౌపది ముర్ము శబరిమలకు చేరుకున్నారు. రాష్ట్రపతి కోసం నిబంధనలు సడలించిన అధికారులు వాహనాల్లో శబరిమల చేరుకునేలా ఏర్పాట్లు చేశారు (Draupadi Murmu Sabarimala visit).


అంతకుముందు శబరిమలకు వెళ్తున్న క్రమంలో రాష్ట్రపతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు (Sabarimala darshan President). అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఆమె హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ప్రమదం ప్రాంతంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా హెలిప్యాడ్ కుంగిపోయింది. హెలికాప్టర్ చక్రం హెలిప్యాడ్ కాంక్రీట్‌లో కూరుకుపోయింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను సరిచేశారు.


ఇవి కూడా చదవండి..

స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..


మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2025 | 02:02 PM