Share News

పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుపై నిర్మాణ సంస్థ షాకింగ్ నిర్ణయం..

ABN , Publish Date - May 30 , 2026 | 10:47 AM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా టికెట్ ధరల అంశంపై చిత్ర నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గింది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.

పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుపై నిర్మాణ సంస్థ షాకింగ్ నిర్ణయం..
Ram Charan Peddi Movie

హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా టికెట్ ధరల అంశంపై చిత్ర నిర్మాణ సంస్థ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ధరల పెంపును కోరుతూ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. జూన్ 4న రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదల కానుంది. అయితే, వారం రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హోం సెక్రటరీకి నిర్మాణ సంస్థ రెండు సార్లు వినతిపత్రాలు సమర్పించింది.


అయినప్పటికీ ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. అయితే, టికెట్ ధరల అంశంపై గతంలో వెలువడిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో పెద్ది సినిమా నిర్మాణ సంస్థ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

లింగంపల్లి ఆర్‌ఓబీ పనులకు మోక్షం

కర్ణాటక ముఖ్యమంత్రిగా జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం..?

Updated Date - May 30 , 2026 | 10:57 AM