బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల యత్నం.. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత
ABN , Publish Date - May 30 , 2026 | 12:29 PM
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్ దగ్గరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
హైదరాబాద్, మే 30: సింగరేణి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్ దగ్గరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ భవన్‌లో ఉన్న బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ పోలీసుల దిగ్బంధంలో ఉంది.
ఏసీపీ ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘బాల్క సుమన్‌పై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సింగరేణి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని బాల్క సుమన్ మాట్లాడారు. సింగరేణి ఉద్యోగుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. బీఆర్ఎస్ భవన్‌లో ఉన్న సుమన్‌కు నోటీస్ ఇచ్చి తీసుకెళ్తాం’ అని అన్నారు.
బాల్క సుమన్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌లో వివరాలు..
బాల్క సుమన్‌పై 326(g), 351(3), 353(1)(b), r/w55, r/w 61(2)(a), bns 4 pdppa కింద కేసు నమోదైంది. ఆనంద్ అనే వ్యక్తి బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘సింగరేణిని తగలపెట్టండి. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ఆఫీస్‌లను తగలబెడదాం. నెల రోజులు జైలుకు పోయి వస్తాము’ అని బాల్క సుమన్ కామెంట్లు చేసినట్లు ఆనంద్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..
వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..