Share News

వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..

ABN , Publish Date - May 30 , 2026 | 12:32 PM

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో వైభవ్ సూర్యవంశీ లక్ష్యంగా గుజరాత్ టైటాన్స్ అనుసరించిన బాడీ-లైన్ బౌలింగ్ వ్యూహంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..
Vaibhav Sooryavanshi

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో వైభవ్ సూర్యవంశీ లక్ష్యంగా గుజరాత్ టైటాన్స్ అనుసరించిన బాడీ-లైన్ బౌలింగ్ వ్యూహంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల యువ ఆటగాడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడం తనకు నచ్చలేదని పఠాన్ వెల్లడించాడు (Vaibhav Sooryavanshi).


శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు షార్ట్‌పిచ్ బంతులతో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వైభవ్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి రాజస్థాన్‌కు భారీ స్కోరు అందించాడు. పలుసార్లు బంతి తన శరీరాన్ని తాకినప్పటికీ వైభవ్ వెనక్కి తగ్గలేదు. ఈ మ్యాచ్ అనంతరం ఇర్ఫాన్ పఠాన్ గుజరాత్ బౌలర్ల వ్యూహాన్ని తప్పుపట్టాడు (GT Body Line Bowling).


'15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు నచ్చలేదు. అతడు సీనియర్ ఆటగాళ్లతో అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాంటి వ్యూహాలు సహజమే అని తెలుసు. కానీ ఒక తండ్రిగా నా మనసు మాత్రం దాన్ని అంగీకరించడం లేదు' అని పఠాన్ (Irfan Pathan) పేర్కొన్నాడు. కాగా, వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు, పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం 15 ఏళ్ల వయసులో ఇలాంటి పరిపక్వతతో ఆడటం చాలా ప్రత్యేకమని కొనియాడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే

Updated Date - May 30 , 2026 | 01:07 PM