Share News

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే

ABN , Publish Date - May 30 , 2026 | 06:44 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, డాలర్ మార్పిడి విలువల ప్రభావంతో పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే
gold and silver rates today

అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, డాలర్ మార్పిడి విలువల ప్రభావంతో పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold and Silver Rates).


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,650గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,44,510గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,800గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,44,660గా ఉంది. (Gold Rate live).


మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి (Silver prices today). వెండి కిలోకు వంద రూపాయల రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,90,100గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,80,100గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,90,100గా, బెంగళూరులో రూ.2,80,100గా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


Also Read:

ప్రతి 10 మందిలో 7 మందికి ఫైబర్ లోపం.. షాకింగ్ రిపోర్ట్

తెలంగాణ రైతుల కృషితోనే ఈ అగ్రస్థానం: మంత్రి తుమ్మల

Updated Date - May 30 , 2026 | 06:44 AM