73ఏళ్ల తర్వాత సంచలన నిర్ణయం.. మిస్ యూనివర్స్ 2026కు 'మిస్ ఫ్రాన్స్' గుడ్ బై
ABN , Publish Date - May 29 , 2026 | 09:08 PM
73 ఏళ్లుగా ప్రపంచ సౌందర్య వేదికపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిస్ యూనివర్స్ 2026 పోటీలకు మిస్ ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనబోనని ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ప్రతిష్ఠాత్మక అందాల పోటీలైన 'మిస్ యూనివర్స్' చరిత్రలో ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘమైన 73 సంవత్సరాల అనుబంధం తర్వాత, 'మిస్ యూనివర్స్ 2026' పోటీల నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు 'మిస్ ఫ్రాన్స్' సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ ఫ్యాషన్, అందాల పోటీల ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత 2025 ఎడిషన్ నిర్వహణ సందర్భంగా తలెత్తిన అనేక లోపాలను ప్రధాన కారణంగా చూపుతూ.. మిస్ ఫ్రాన్స్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మిస్ యూనివర్స్ సంస్థతో ఉన్న భాగస్వామ్యాన్ని ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది.
మిస్ ఫ్రాన్స్ సంస్థ అధ్యక్షుడు ఫ్రెడరిక్ గిల్బర్ట్ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ వేదికపై ఫ్రాన్స్ సంస్కృతిని, ప్రతిభను ప్రదర్శించడానికి మిస్ యూనివర్స్ ఎల్లప్పుడూ ఓ అద్భుతమైన అవకాశం. ఇది మాకో మైలురాయి లాంటిది. అయితే, మా సంస్థ నమ్ముకున్న విలువలకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవడం మా ప్రాథమిక బాధ్యత. భవిష్యత్తులో జరిగే మార్పులను మేము నిశితంగా పరిశీలిస్తాం’ అని అన్నారు. మిస్ యూనివర్స్ నుంచి మిస్ ఫ్రాన్స్ వైదొలగడాన్ని ధ్రువీకరిస్తూ.. ఈ సంవత్సరం రెండు సంస్థలు ఎలా సహకరించుకుంటాయో వివరిస్తూ ఆ పోటీల నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read:
ప్రతి 10 మందిలో 7 మందికి ఫైబర్ లోపం.. షాకింగ్ రిపోర్ట్
తెలంగాణ రైతుల కృషితోనే ఈ అగ్రస్థానం: మంత్రి తుమ్మల
For More Latest News