Share News

తెలంగాణ రైతుల కృషితోనే ఈ అగ్రస్థానం: మంత్రి తుమ్మల

ABN , Publish Date - May 29 , 2026 | 07:56 PM

ది ఆయిల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ పామ్ (NMEO-OP) అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

తెలంగాణ రైతుల కృషితోనే ఈ అగ్రస్థానం: మంత్రి తుమ్మల
TG Minister Thummala Nageswara Rao.

హైదరాబాద్, మే 29: ది ఆయిల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ పామ్ (NMEO-OP) అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జాతీయ ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ వాటా 36 శాతంగా నమోదయిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 2021–2026 మధ్య దేశంలో 2.73 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు అయిందని తెలిపారు. అందులో 98,112 హెక్టార్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.


తెలంగాణ రైతుల కృషితోనే ఈ అగ్రస్థానం సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని చెప్పారు. 79,448 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని ఆయన గణాంకాలతో సహా వివరించారు. రైతులకు ఎకరాకు రూ.2 నుంచి 3 లక్షల వార్షిక ఆదాయం అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. ఫ్రెష్ ఫ్రూట్ బంచ్‌లకు (FFBs) రూ.23,501/ మెట్రిక్ టన్ను గిట్టుబాటు ధరగా ఉందని తెలిపారు.


దిగుమతి సుంకం పెంపుతో ధర రూ.25,000 వరకు పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే 3 ప్రాసెసింగ్ మిల్లులు, మరో 7 నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. 2026–27లో అదనంగా 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయ వృద్ధి ప్లస్ గ్రామీణ ఉపాధి పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

For TG News And Telugu News

Updated Date - May 29 , 2026 | 08:10 PM