Share News

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ABN , Publish Date - May 29 , 2026 | 06:44 PM

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వయోభారం కారణంగా.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..శుక్రవారం హైదరాబాద్‌లోని నివాసంలో మృతి చెందారు.

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
Gade Venkata Reddy

హైదరాబాద్, మే29: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వయోభారం కారణంగా.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..శుక్రవారం హైదరాబాద్‌లోని నివాసంలో మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.


1940, జులై 10వ తేదీన ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో గాదె వెంకటరెడ్డి జన్మించారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన.. ప్రజాసేవపై ఉన్న ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1967లో అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. అలా 27 ఏళ్ల వయస్సులో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఆయన వరుస ఓటములను చవిచూశారు.


1991లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 1994లో పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొంది.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్లలో మంత్రిగా పని చేశారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా వెంకటరెడ్డి పని చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

తులసి మొక్క ఎండిపోయిందని బయట పడేస్తున్నారా..?

For More TG News And Telugu News

Updated Date - May 29 , 2026 | 07:06 PM