Share News

తులసి మొక్క ఎండిపోయిందని బయట పడేస్తున్నారా..?

ABN , Publish Date - May 29 , 2026 | 05:28 PM

పురాణాల్లో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిలో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క ఎండిపోతే పనికిరాదని భావించి అంతా బయట పాడేస్తారు.

తులసి మొక్క ఎండిపోయిందని బయట పడేస్తున్నారా..?
Uses Of Dried Tulasi Plant

పురాణాల్లో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిలో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క ఎండిపోతే పనికిరాదని భావించి అంతా బయట పాడేస్తారు. కానీ తులసి మొక్క ఎండిపోయిన తర్వాత దాని ఆకులు, కాండాలు, వేర్లు కూడా ఆయుర్వేద, ఉద్యానవన నిపుణులు చెబుతున్నారు.


ఎండిన ఆకులు..

ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న దోమల నివారణ మందులు మన ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలతో నిండి ఉన్నాయి. వీటికి బదులుగా ఎండిన తులసి ఆకులను సహజసిద్ధమైన దోమల నివారణిగా ఉపయోగించవచ్చు. అందుకోసం ఎండిపోయిన తులసి ఆకులను చిన్న ముక్కలుగా కోసి.. కొద్దిగా కర్పూరంలో కలిపి కాల్చితే. ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. తులసిలో ఉండే సహజ కీటకనాశక గుణాలు, ఇంటిలోని ప్రతి మూల నుంచి దోమలు, ఈగలతోపాటు ఇతర చిన్న కీటకాలను తరిమివేస్తాయి. ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.


అద్భుతమైన ఎరువుగా..

తులసి మొక్క ఎండిపోయి ఉంటే.. దానిని పారవేయవద్దు. ఆ మొక్క కాండం, వేర్లు, ఆకులను చిన్న చిన్న ముక్కులుగా చేయాలి. ఆ మిశ్రమాన్ని మీ తోట మట్టిలో లేదా మొక్కల కుండీలలో కొంచెం లోతుగా పాతిపెట్టాలి. ఇది నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇతర మొక్కలకు సోకే శిలీంధ్రాలు, వేరు కుళ్లడం, కీటకాల నుంచి సహజ రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంది.


మసాలా చాయ్..

ఎండిన తులసి కాడలు, ఆకులను నూరిన తర్వాత మిగిలిన పొడిని మసాలా చాయ్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ తులసి పొడికి రెండు లేదా మూడు టీస్పూన్ల ఎండిన గులాబీ రేకులు, లవంగాలు, యాలకులు, సోంపు గింజలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మొత్తం మిశ్రమంతో చేసిన మసాలా చాయ్ రూచిగా ఉండటమే కాకుండా.. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


ఎండిన తులసి ముక్కలు..

ఇంట్లో హోమం చేసినప్పుడు, ప్రతి సాయంత్రం పూజ తర్వాత చేసే హారతిలో ఎండిన తులసి ముక్కలను ఉపయోగించవచ్చు. కర్పూరం, అగరబత్తితోపాటు ఈ ఎండిన తులసి ముక్కలను కూడా కాల్చాలి. దీని నుంచి వెలువడే పవిత్రమైన పొగ ప్రతికూల శక్తిని తొలగించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. గాలిని ఈ పొగ శుద్ధి చేసి.. సహజ క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది.


తులసి తీర్థం..

ఎండిన తులసి కాడలు చాలా సన్నగా ఉంటే.. వాటిని శుభ్రం చేసి నీటితో నింపిన రాగి పాత్రలో ఉంచాలి. కొన్ని గంటల పాటు వాటిని నీటి ఉంచాలి. తులసిలోని ఔషధ గుణాలు నీటిలోకి చేరడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత కాడలు తీసి.. ఆ నీటిని ఇంట్లో చల్లాలి. దీని వల్ల గాలిలోని బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. ఆధ్యాత్మికంగా.. ఇంటి స్వచ్ఛత, సానుకూల శక్తిని రెట్టింపు చేస్తుంది. కాబట్టి ఎండిన తులసి చెట్టును ఎప్పుడు చెత్తబుట్టలో పారేయకుండా ఇలా వినియోగిస్తే చాలా మంచిది.


గమనిక.. ఈ కథనం ఇంటర్నెట్‌లో లభించిన నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదు. దీనికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏ విధంగానూ బాధ్యత వహించదు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండుసార్లు విమానం ల్యాండింగ్‌ ఫెయిల్‌.. చివరికి ఏమైందంటే?

10 నిమిషాల్లో రూ.1,200 సంపాదించిన భారతీయుడు.. చివరకు.?

For More Pratyekam And Telugu News

Updated Date - May 29 , 2026 | 05:41 PM