Share News

10 నిమిషాల్లో రూ.1,200 సంపాదించిన భారతీయుడు.. చివరకు.?

ABN , Publish Date - May 28 , 2026 | 04:20 PM

విదేశాల్లో చదువుకోవడానికో, ఉద్యోగానికో వెళ్లిన వారు ఖాళీ సమయంలో రకరకాల పార్ట్‌టైమ్ పనులు చేయడం మనం చూస్తుంటాం. అయితే లండన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన విష్ణు విజయధరన్ అనే యువకుడు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి ఓ వినూత్న ప్రయోగం చేశాడు.

10 నిమిషాల్లో రూ.1,200 సంపాదించిన భారతీయుడు.. చివరకు.?
Indian Man Viral Video

ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో చదువుకోవడానికో, ఉద్యోగానికో వెళ్లిన వారు ఖాళీ సమయంలో రకరకాల పార్ట్-టైమ్ పనులు చేయడం మనం చూస్తుంటాం. అయితే లండన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన విష్ణు విజయధరన్ అనే యువకుడు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి ఓ వినూత్న ప్రయోగం చేశాడు. లండన్ వీధుల్లోని ఓ రద్దీ ప్రాంతంలో విష్ణు పర్యాటకుల వద్దకు వెళ్లి, వారి పోలరాయిడ్ చిత్రాలను తీసి ఒక్కో ఫొటోను 5 పౌండ్లకు(సుమారు రూ.644) అమ్మాడు. అలా కేవలం 10 నిమిషాల్లోనే రూ.1,200 సంపాదించాడు. కానీ, అతనికా సంతోషం ఎంతోసేపు నిలవలేదు.


విష్ణు తన వ్యాపార ప్రయోగానికి సంబంధించిన విజువల్స్ మొత్తాన్ని ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నాడు. ‘లండన్‌లో పోలరాయిడ్ చిత్రాలను అమ్మడం ద్వారా మనం ఎంత డబ్బు సంపాదించగలమో చూద్దాం’ అంటూ అతను ఆ వీడియోను ప్రారంభించాడు. వరుసగా 38 ఫొటోలు తీయగల సామర్థ్యం ఉన్న ఓ కోడక్ పోలరాయిడ్ కెమెరాను కొనుగోలు చేసేందుకు తాను సుమారు 130 పౌండ్లు(రూ.14,000) ఖర్చు చేసినట్లు ఆ వీడియోలో వెల్లడించాడు విష్ణు. అతను కెమెరా పట్టుకుని నిల్చోగానే చాలా మంది పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా అతని వద్దకు వచ్చి ఫొటోలు తీయించుకోవడం ప్రారంభించారు.


విష్ణు వ్యాపారం ఎంతో వేగంగా సాగుతుండటంతో.. ఆ సమయంలో తాను ఈ బిజినెస్‌తో కోట్లు సంపాదించబోతున్నామని నిజంగానే అనుకున్నట్లు విష్ణు సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే, అతను వ్యాపారం ప్రారంభించిన 10 నిమిషాల్లోనే సుమారు 11 పౌండ్లు(రూ.1,200 కంటే ఎక్కువ) సంపాదించేసరికి సీన్ రివర్స్ అయింది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి.. అనుమతి లేకుండా వీధి వ్యాపారం చేస్తున్నందుకు అతడిని అడ్డుకున్నారు. ఈ వీడియోకు విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చాడు. ‘10 నిమిషాల్లో మనం ఎంత సంపాదించాం? మీ వీసా రేపే గడువు ముగిసిపోతుంటేనే ఈ ట్రిక్ ప్రయత్నించండి’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. విదేశాల్లో సరైన అనుమతులు, లైసెన్సులు లేకుండా ఇలాంటి వీధి వ్యాపారాలు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసేలా అతను ఈ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అయింది.


ఇవి కూడా చదవండి

ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. సైనిక స్థావరమే టార్గెట్..

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

Updated Date - May 28 , 2026 | 06:16 PM