Share News

మహారాష్ట్రలోని అమరావతిలో ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. వీడియో వైరల్

ABN , Publish Date - May 27 , 2026 | 04:52 PM

మహారాష్ట్రలోని అమరావతి నగరంలో జనాలతో రద్దీగా ఉండే రాంపూరి క్యాంప్ ప్రాంతంలోని ఒక ఇంట్లోకి హఠాత్తుగా చిరుత ప్రవేశించింది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని అమరావతిలో ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. వీడియో వైరల్
Leopard in Maharashtra

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో జనాలతో రద్దీగా ఉండే రాంపూరి క్యాంప్ ప్రాంతంలోని ఒక ఇంట్లోకి హఠాత్తుగా ఒక చిరుత ప్రవేశించింది. ఆ నివాస ప్రాంతంలో చిరుత సంచరిస్తూ కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ, పోలీసు సిబ్బంది, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించారు. రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగి భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు.


దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన అనంతరం ఎట్టకేలకు ఆ చిరుతను సురక్షితంగా బంధించారు. పట్టుబడిన ఆ చిరుతపులి వయస్సు సుమారు తొమ్మిది నుంచి పది నెలల వరకు ఉండవచ్చని రెస్క్యూ బృందం తెలిపింది. ఈ ఘటనపై అమరావతి మేయర్ శ్రీచంద్ తేజ్వానీ స్థానిక నివాసితులతో మాట్లాడారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అధికారులు సకాలంలో స్పందించి చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?

ఘనంగా 'అప్నాపన్: మై ఎక్స్‌పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం..

Updated Date - May 27 , 2026 | 05:53 PM