Share News

ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?

ABN , Publish Date - May 26 , 2026 | 01:44 PM

బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాల యాన్ని (ఆర్జీయూకేటీ) రాష్ట్రంలోని ఇతర సాధారణ విశ్వవిద్యాలయాల తరహాలోనే మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?
RGUKT Basara

  • సాధారణ వర్సిటీల బాటలోనే బాసర ట్రిపుల్‌ ఐటీ

  • వర్సిటీ చట్ట సవరణకు ప్రభుత్వం నిర్ణయం

  • ఇతర విశ్వవిద్యాలయాల తరహాలోనే పరిపాలన

  • త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేలా విద్యాశాఖ దృష్టి

బాసర(ఆదిలాబాద్): బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాల యాన్ని (ఆర్జీయూకేటీ) రాష్ట్రంలోని ఇతర సాధారణ విశ్వవిద్యాలయాల తరహాలోనే మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ వర్సిటీకి కూడా ఇకపై గవర్నరే ఛాన్స్‌లర్‌గా వ్యవహరించేలా 2008 నాటి చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా విద్యాశాఖ ముసాయిదాను రూపొందించింది.


క్యాబినెట్‌ సూచనలతో మార్పులు..

తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ బిల్లు ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. వర్సిటీ పరిపాలనను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా మరికొన్ని అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని క్యాబినెట్‌ విద్యా శాఖకు సూచించింది. మంత్రి మండలి నిర్ణయాల మేరకు అధికారులు ప్రస్తుతం ముసాయిదాకు తుదిరూపు ఇస్తున్నారు. వచ్చేఅసెంబ్లీ సమా వేశాల నాటికి సవరించిన బిల్లును సిద్ధం చేసి, సభ ఆమోదం పొందాలని సర్కారుభావిస్తోంది.


ప్రతిపాదిత చట్ట సవరణలో ముఖ్యాంశాలు...

  • రాష్ట్రంలోని మిగిలిన విశ్వవిద్యాలయాలకు గవర్నరే చాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్జీ యూకేటీకి కూడా అదే విధానాన్ని వర్తిం పజేస్తారు.

  • గవర్నర్‌ చాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వైస్‌చాన్సలర్‌ (వీసీ) నియామకం కోసం ప్రభుత్వం ఒక సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీ సిఫారసు చేసిన వారి నుంచి సమర్ధుడైన అధికారిని వీసీగా నియమిస్తారు. ఆయన వర్సిటీకి పూర్తికాలపు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. చాన్సలర్‌ లేని కారణంగా గత 12ఏళ్ల నుంచి ఇన్‌చార్జీ వీసీల పాలన లో కొనసాగుతుంది.

  • ప్రస్తుతం ఆర్జీయూకేటీలో ఉన్న పరిపాలనా విభాగాన్ని ప్రక్షాళన చేస్తూ, ఇతర వర్సిటీల లాగే ఇక్కడ కూడా అధికారికంగా రిజిస్ర్టార్‌ పోస్టును సృష్టించనున్నారు.


xx.jpgఎందుకీ నిర్ణయం ?

బాసర ట్రిపుల్‌ ఐటీని ప్రారంభించినప్పటి నుంచి దానికంటూ ప్రత్యేక చట్టం, స్వతంత్ర పాలనాబోర్డు ఉండేవి. అయితే, గత కొంతకాలంగా వర్సిటీలో పూర్తిస్థాయి అధికారులు లేకపో వడం, అంతర్గత పరిపాలనా లోపాలు, విద్యార్థుల సమస్యలు సవాలుగా మారాయి. మిగతా విశ్వవిద్యాలయాల తరహాలో ఇక్కడ కూడా గవర్నర్‌ను ఛాన్సలర్‌గా నియమించి, సెర్చ్‌ కమిటీ ద్వారా పూర్తిస్థాయి వీసీని, రిజిస్ర్టార్‌ను నియమిస్తే.. అడ్మినిస్ర్టేషన్‌లో పారదర్శకత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.


తద్వారా నిధుల వినియోగం, విద్యా ప్రమాణాల పర్యవేక్షణ మరింత సులువవుతుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. యూనివర్సిటీకి ప్రత్యేక చట్టం ఉండడం వలన ఈసీ నియామకంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని తొలగించేందుకు అన్ని యూనివర్సిటీల మాదిరిగానే ఆర్జీయూకేటీ పరి పాలనను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

డబ్బు కోసం డ్రగ్స్ దందా.. సింగర్ కారులో 5 కేజీల హెరాయిన్ లభ్యం..

సామాన్యుడిపై మరో భారం.. కిలోకు రూ.2 పెరిగిన సీఎన్‌జీ ధర..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 26 , 2026 | 01:44 PM