Share News

ఆర్సీబీని కలవరపెడుతోన్న కోహ్లీ ప్లే ఆఫ్స్ రికార్డు

ABN , Publish Date - May 26 , 2026 | 12:59 PM

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కోహ్లీ పాత్ర కీలకంగా మారనున్న వేళ.. అతడి ప్లే ఆఫ్స్ రికార్డు మాత్రం ఆర్సీబీ అభిమానులను కాస్త కలవరపెడుతోంది.

ఆర్సీబీని కలవరపెడుతోన్న కోహ్లీ ప్లే ఆఫ్స్ రికార్డు
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కోహ్లీ పాత్ర కీలకంగా మారనున్న వేళ.. అతడి ప్లే ఆఫ్స్ రికార్డు మాత్రం ఆర్సీబీ అభిమానులను కాస్త కలవరపెడుతోంది.


ఈ సీజన్‌లో విరాట్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. 14 మ్యాచుల్లో 557 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. లీగ్ స్టేజ్‌లో దూకుడు ప్రదర్శించే కోహ్లీ.. ప్లే ఆఫ్స్‌లో మాత్రం కాస్త తడబడుతూ వస్తున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అతడి గణాంకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు 17 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 396 పరుగులే చేశాడు. 26.40 సగటు, 121.10 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ క్రికెట్ కెరీర్‌లోనే ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యంత చెత్త రికార్డులు ఉన్నాయి. దీంతో ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌లో అయినా కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ చెత్త రికార్డుకు కోహ్లీ ఈ సీజన్‌లోనైనా చెక్ పెట్టి దూకుడుగా ఆడతాడా? అనేది చూడాల్సి ఉంది.


మరోవైపు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు భీకరమైన ఫామ్‌లో ఉంది. అంచనాలే లేకుండా బరిలోకి దిగి.. ఇప్పుడు టైటిల్ ఫేవరెట్‌గా మారింది. సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో తడబడిన జీటీ.. బౌలింగ్ దళంతో చెలరేగి టైటిల్ రేసులో నిలిచింది. కాగా క్వాలిఫయర్ 1లో విజయం సాధించిన జట్టు.. నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరొక ఛాన్స్ లభిస్తుందన్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో కొత్త చరిత్ర.. ఆ నాలుగింట్లో ఏ జట్టు గెలిచినా..!

ఇన్‌స్టాలో పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్!

Updated Date - May 26 , 2026 | 01:02 PM