Share News

ఆర్సీబీ నుంచి తప్పుకోవడం నా నిర్ణయం కాదు: యశ్ దయాల్

ABN , Publish Date - May 26 , 2026 | 10:28 AM

ఆర్సీబీ నుంచి తప్పుకోవడంపై స్టార్ పేసర్ యశ్ దయాల్ తొలిసారి స్పందించాడు. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఆర్సీబీ నుంచి తప్పుకోవడం నా నిర్ణయం కాదు: యశ్ దయాల్
Yash Dayal

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ పేసర్ యశ్ దయాల్‌ది కీలక పాత్ర. అయితే ఈ సీజన్‌కు యశ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నుంచి తప్పుకోవడంపై యశ్ తొలిసారి స్పందించాడు. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


‘టీవీలో ఆర్సీబీ మ్యాచ్‌లు చూస్తూ కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతుంటాను. వారు నన్ను జట్టు నుంచి తొలగించలేదు. రిటైన్ కూడా చేశారు. నా స్థానంలో మరొకరిని తీసుకోలేదు. అంటే నన్ను కీలక ఆటగాడిగా భావిస్తున్నారనే కదా అర్థం. కానీ ఈ సీజన్‌కు దూరంగా ఉండటం మాత్రం నా నిర్ణయం కాదు. ఈ వ్యాఖ్య వివాదాస్పదం కొవొచ్చు. అయితే నిర్ణయాలు ఎప్పుడూ అధికారుల చేతుల్లోనే ఉంటాయి. ఏదేమైనా ఆర్సీబీతో నా అనుబంధం కొనసాగుతోంది. కోచ్‌లు, మేనేజ్‌మెంట్ సభ్యులతో ఇప్పటికీ మాట్లాడుతున్నాను’ అని దయాల్ వెల్లడించాడు.


ఇదిలా ఉంటే, యశ్ ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు యశ్ దయాల్ జట్టుతో చేరబోడని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బాబత్ ధ్రువీకరించారు. అయితే అతడు ఆర్సీబీ కాంట్రాక్ట్‌లోనే ఉంటాడని తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. ట్రోల్స్‌పై శ్రేయస్ సోదరి ఆవేదన

పద్మశ్రీ అందుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్

Updated Date - May 26 , 2026 | 10:31 AM