Share News

అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. ట్రోల్స్‌పై శ్రేయస్ సోదరి ఆవేదన

ABN , Publish Date - May 26 , 2026 | 09:25 AM

శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ కేకేఆర్‌ను ఉద్దేశించి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వీడియో కారణంగా ఆమె తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. తనపై వస్తోన్న ట్రోల్స్‌ను ఉద్దేశించి శ్రేష్ఠ స్పందిస్తూ రెండు వీడియోలు విడుదల చేసింది.

అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. ట్రోల్స్‌పై శ్రేయస్ సోదరి ఆవేదన
Shresta Iyer

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం లీగ్ స్టేజ్‌లోనే ముగిసింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తొలి ఏడు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన పంజాబ్.. అనూహ్యంగా గాడి తప్పి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే జట్టు ప్రదర్శనతో పాటు శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ కేకేఆర్‌ను ఉద్దేశించి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వీడియో కారణంగా ఆమె తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. తనపై వస్తోన్న ట్రోల్స్‌ను ఉద్దేశించి శ్రేష్ఠ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.


‘ఆ వీడియో కేవలం సరదాగా చేసింది. నాకు ఎవ్వరినీ అవమానించాలనే ఉద్దేశం లేదు. ప్రతి క్రికెటర్‌పై నాకు గౌరవం ఉంది. ఎందుకంటే నా సోదరుడు కూడా క్రికెటరే. నేనే చేసిన వీడియోను తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. అవి ఇప్పుడు హద్దులు దాటాయి. నేను పని చేసే చోటుకు ఫోన్లు చేసి వేధిస్తున్నారు. నా కుటుంబ సభ్యులను, స్నేహితులను దూషిస్తున్నారు. ఇది సరైంది కాదు. ఇకనైనా ట్రోలింగ్ ఆపండి’ అని శ్రేష్ఠ అయ్యర్ వెల్లడించింది.


ఇంతకీ ఏమైందంటే?

లీగ్ స్టేజ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ.. పంజాబ్ జెర్సీ ధరించి ఓ సరదా వీడియో పోస్ట్ చేసింది. ‘పంజాబీల మనసు చాలా గొప్పది.. ఇదిగో అందుకే మీకు ఒక పాయింట్ ఇచ్చేశాం..’ అంటూ ఆ వీడియోలో కేకేఆర్‌ను ఉద్దేశించి సరదాగా ట్రోల్ చేసింది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొందరు దీనిని తప్పుగా అర్థం చేసుకుని ఆమెపై విమర్శలు చేశారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆ వీడియోను శ్రేష్ఠ తొలగించింది. అయినప్పటికీ ట్రోలింగ్ ఆపకపోవడంతో తాజాగా స్పందించింది.


ఇవీ చదవండి:

ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!

ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!

Updated Date - May 26 , 2026 | 09:32 AM