ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!
ABN , Publish Date - May 25 , 2026 | 10:59 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు అర్జెంటీనా జట్టుకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి గాయపడినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు అర్జెంటీనా జట్టుకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి గాయపడినట్లు సమాచారం. ఆదివారం ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంటర్ మియామి తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న మెస్సి అనూహ్యంగా మైదానాన్ని వీడాడు. మ్యాచ్ ముగియడానికి ముందే మెస్సి తన ఎడమ కాలి వెనక భాగాన్ని పట్టుకుని అసౌకర్యంగా కనిపించాడు. అనంతరం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను బరిలోకి దింపి.. మెస్సి మైదానాన్ని వీడాడు.
ఈ విషయంపై ఇంటర్ మియామి కోచ్ గిల్లెర్మో హోయోస్ స్పందించారు. మెస్సి ఆరోగ్య పరిస్థితిపై వైద్య నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. ‘మెస్సి బాగా అలసిపోయాడు. వర్షం కారణం మైదానం కఠినంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవడం సరైంది కాదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మెస్సిని బయటికి పిలిచాం’ అని వెల్లడించారు. కాగా మెస్సి కొంతకాలంగా కండరాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రీ సీజన్ సమయంలో కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో మెస్సికి తీవ్ర గాయమైతే.. ప్రపంచ కప్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలనుకుంటున్న అర్జెంటీనాకు అది పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది.
కాగా జూన్ 11 నుంచి ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి కెనడా, మెక్సికో, యూఎస్ఏ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 16న అల్జీరియాతో ఆడనుంది. వచ్చే వారం అర్జెంటీనా జట్టును ప్రకటించనుండగా, ఆ తర్వాత అమెరికాలో హోండురాస్, ఐస్‌లాండ్ జట్లతో సన్నాహక మ్యాచ్‌లు ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
ముంబైతో మ్యాచ్‌కు ఫిట్‌గా లేను.. కానీ బరిలోకి దిగా: రియాన్ పరాగ్
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ