Share News

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - May 25 , 2026 | 06:37 AM

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక పోరులో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక పోరులో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 15 ఏళ్ల వైభవ్.. టీ20 టోర్నీ లేదా సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ముంబైతో మ్యాచ్‌కు ముందు 579 పరుగులతో ఉన్న అతడు.. ఈ మ్యాచ్‌లో 6 బంతుల్లో 4 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో తన పరుగుల సంఖ్యను 583కు పెంచుకున్నాడు. ఈ క్రమంలో దేవదత్ పడిక్కల్ రికార్డును బ్రేక్ చేశాడు. 2019-2020 దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరఫున పడిక్కల్ 580 పరుగులు చేశాడు. తాజాగా వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.


ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో ఫామ్ కనబర్చిన రాజస్థాన్.. మధ్యలో గాడీ తప్పి ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై ఇండియన్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది. బ్యాటర్లు కాస్త తడబడినప్పటికీ.. బౌలర్లు మాత్రం చెలరేగి ఆడారు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. బర్గర్ 2, బ్రిజేశ్ శర్మ 2, యశ్ రాజ్ 2 వికెట్లు పడగొట్టి ఆర్ఆర్‌ను విజయతీరాలకు చేర్చారు. రాజస్థాన్ విజయంతో పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మే 27న ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత

Updated Date - May 25 , 2026 | 06:37 AM