Share News

హ్యాట్రిక్‌తో ముగించారు

ABN , Publish Date - May 25 , 2026 | 04:33 AM

ఐపీఎల్‌-19 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ విజయాలతో ముగించింది. ఆదివారం సా యంత్రమే ముంబై ఇండియన్స్‌ను రాజస్థాన్‌ రాయ ల్స్‌ ఓడించి ప్లేఆ్‌ఫ్సకు చేరడంతో....

హ్యాట్రిక్‌తో ముగించారు

ఆఖరి మ్యాచ్‌లో కోల్‌కతాపై ఢిల్లీ విజయం

కోల్‌కతా: ఐపీఎల్‌-19 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ విజయాలతో ముగించింది. ఆదివారం సా యంత్రమే ముంబై ఇండియన్స్‌ను రాజస్థాన్‌ రాయ ల్స్‌ ఓడించి ప్లేఆ్‌ఫ్సకు చేరడంతో.. రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఢిల్లీ ఆడిన ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక ఆల్‌రౌండ్‌షో చూపిన ఢిల్లీ 40 రన్స్‌తో నెగ్గి 14 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. రాహుల్‌ (30 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60), అక్షర్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), మిల్లర్‌ (19 బంతుల్లో 3 సిక్సర్లతో 28) వేగం చూపారు. ఛేదనలో కోల్‌కతా 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. రహానె (39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63), పోవెల్‌ (29), మనీష్‌ (25) ఫర్వాలేదనిపించారు. ఎన్‌గిడి, కుల్దీ్‌పలకు మూడేసి, స్టార్క్‌కు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా కుల్దీప్‌ నిలిచాడు.

రహానె ఒక్కడే..: కోల్‌కతా ఛేదనలో రహానె అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నా అతడికి సహకారం కరువైంది. ఓపెనర్‌ ఆలెన్‌ (20), మనీశ్‌ వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకున్నారు. స్పిన్నర్‌ కుల్దీప్‌ మిడిలార్డర్‌ను కట్టడి చేశాడు. చివరి ఆరుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవడం గమనార్హం.

కలిసికట్టుగా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో రాహుల్‌, అక్షర్‌ ఆకట్టుకున్నారు. చివర్లో మిల్లర్‌ హిట్టింగ్‌తో స్కోరు 200 దాటింది. ఆరంభంలో రాహుల్‌, పోరెల్‌ (22) ఎదురుదాడికి దిగారు. తొలి ఓవర్‌లో రాహుల్‌ 6,4తో జోరు చూపాడు. రెండు ఫోర్లు బాదిన పోరెల్‌ను సౌరభ్‌ దూబే అవుట్‌ చేశాడు. దీంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 53/1తో నిలిచింది. అనంతరం రాహుల్‌కు సాహిల్‌ (24) సహకారం అందించాడు. రెండో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం తర్వాత సాహిల్‌ వెనుదిరిగాడు. ఇక 11వ ఓవర్లో అక్షర్‌ 4,4 రాహుల్‌ 4,6తో 20 రన్స్‌ సమకూరాయి. అలాగే 25 బంతుల్లో రాహుల్‌ ఫిఫ్టీని పూర్తి చేశాడు. కాసేపటికే రాహుల్‌ను అనుకుల్‌ పెవిలియన్‌ చేర్చాడు. అటు 17వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన అక్షర్‌ను వరుణ్‌ అవుట్‌ చేయగా.. ఆఖర్లో మిల్లర్‌, అశుతోష్‌ (18 నాటౌట్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో డీసీ సవాల్‌ విసిరే స్కోరందుకుంది.


ఢిల్లీ: పొరెల్‌ (సి) దహియా (బి) సౌరభ్‌ దూబే 22, రాహుల్‌ (సి) పావెల్‌ (బి) అనుకుల్‌ 60, సాహిల్‌ (సి) రహానె (బి) నరైన్‌ 24, అక్షర్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 39, మిల్లర్‌ (సి) ఆలెన్‌ (బి) సౌరభ్‌ దూబే 28, అశుతోష్‌ (నాటౌట్‌) 18, స్టబ్స్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 203/5; వికెట్ల పతనం: 1-40, 2-87, 3-125, 4-166, 5-201; బౌలింగ్‌: అనుకుల్‌ 2-0-23-1, సౌరభ్‌ దూబే 4-0-28-2, గ్రీన్‌ 2-0-21-0, కార్తీక్‌ 4-0-55-0, నరైన్‌ 4-0-38-1, వరుణ్‌ 4-0-35-1.

కోల్‌కతా: రహానె (సి) మిల్లర్‌ (బి) కుల్దీప్‌ 63, ఆలెన్‌ (బి) ఎన్‌గిడి 20, మనీష్‌ (సి) స్టార్క్‌ (బి) ఎన్‌గిడి 25, గ్రీన్‌ (సి) మిల్లర్‌ (బి) కుల్దీప్‌ 2, పావెల్‌ (రనౌట్‌) 29, రింకూ (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 0, తేజస్వి (బి) అక్షర్‌ 1, అనుకుల్‌ (సి అండ్‌ బి) స్టార్క్‌ 9, త్యాగి (సి) అక్షర్‌ (బి) స్టార్క్‌ 0, వరుణ్‌ (సి) అక్షర్‌ (బి) ఎన్‌గిడి 5, సౌరభ్‌ దూబే (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 18.4 ఓవర్లలో 163 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-43, 2-87, 3-96, 4-128, 5-128, 6-129, 7-154, 8-154, 9-155, 10-163; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-26-2, అకీబ్‌ 2-0-23-0, ఎన్‌గిడి 3.4-0-27-3, అక్షర్‌ 4-0-38-1, మాధవ్‌ 2-0-20-0, కుల్దీప్‌ 4-0-29-3.

ఇవి కూడా చదవండి:

అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

Updated Date - May 25 , 2026 | 04:33 AM