అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - May 24 , 2026 | 10:19 AM
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎల్ఎస్‌జీ జట్టు తరఫున అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో మైదానంలో తమ్ముడిని చూసి సోదరి సారా టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున మైదానంలోకి దిగిన అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన చూసి సారా సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన అర్జున్ ఓ వికెట్‌ను సాధించాడు. అలానే షమీ బౌలింగ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అర్జున్ టెండూల్కర్ మైదానంలో వికెట్ తీసి సంబరాలు చేసుకుంటున్న ఫోటోను సారా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. 'నువ్వు ఈ ప్రపంచంలోని అన్ని సంతోషాలకు అర్హుడివి రా.. తమ్ముడా! నీ కష్టపడే తత్వం, ఒత్తిడిని అధిగమించే నీ నైపుణ్యం ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నువ్వు చూపించిన ఓపికను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ సోదరుడిపై సారా తన ప్రేమను కురిపించింది.
సారా టెండూల్కర్ తన పోస్టులో పేర్కొన్నట్లుగానే అర్జున్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడిగా అతడిపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసేందుకు అర్జున్ టెండూల్కర్ గత కొంతకాలంగా ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తనను తాను నిరూపించుకోవడానికి నిరంతరం శ్రమించాడు. చివరకుపంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెర్సీతో అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగాడు. 4 ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి ఓ కీలక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ ఆఖరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
టీజీ టి20 లీగ్‌కు ఖరారైన ఎనిమిది ఫ్రాంఛైజీలు
ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..