Home » Arjun Tendulkar
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహచరుడు, భారత స్పిన్ కింగ్ రవిచంద్రన్ అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మాజీ క్రికెటర్లు ఈ వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమం క్రికెట్ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దంపతులు హాజరయ్యారు.
మార్చి 5న అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలో తన కొడుకు గురించి మాట్లాడుతూ సచిన్ భావోద్వేగానికి గురయ్యాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ తన కుటుంబంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. అర్జున్ టెండూల్కర్- సానియా చందోక్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.
అర్జున్ టెండుల్కర్ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నాడు. మార్చ్ 5న అతడి వివాహం జరగనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతేడాది ముంబై పారిశ్రామికవేత్త మనవరాలు సానియా చందోక్‌తో అతడి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
కోచ్‌లపై టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను కోచ్‌లు సరైన దిశలో తీర్చిదిద్దడం లేదని విమర్శించాడు.
పేస్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించ లేకపోయినా, బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్‌ను జట్టు నుంచి విడుదల చేయనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అర్జున్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునేందుకు ఎల్ఎస్‌జీతో ట్రేడ్ జరుపుతున్నట్లు సమాచారం.
బాలీవుడ్, వ్యాపార రంగాల్లో నిత్యం ఏదో కొత్త చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా సచిన్ కుమారుడు అర్జున్‌కి, ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే సానియా వృత్తి ఏంటి? ఎంత సంపాదిస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.