Share News

అర్జున్ టెండూల్కర్ వివాహం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

ABN , Publish Date - Feb 10 , 2026 | 08:35 PM

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ తన కుటుంబంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. అర్జున్ టెండూల్కర్- సానియా చందోక్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.

అర్జున్ టెండూల్కర్ వివాహం.. ప్రధాని మోదీకి ఆహ్వానం
Sachin Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు సానియా చందోక్‌ను అతడు వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 5న ముంబైలో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో సచిన్ తన కుటుంబంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. అర్జున్ టెండూల్కర్- సానియా చందోక్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సచిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ భేటీలో అర్జున్‌తో పాటు సచిన్ భార్య అంజలి, కుమార్తె సారా కూడా పాల్గొన్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనవరాలే సానియా (Saaniya Chandhok). ఆమె కూడా వ్యాపారవేత్తే. ముంబైలో మిస్టర్‌ పాస్‌ పెట్‌ స్పా సంస్థను నడుపుతోంది. చాలా ఏళ్ల నుంచి సచిన్ కుమార్తె సారాతో సానియాకు అనుబంధం ఉంది.


దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న అర్జున్ టెండూల్కర్ ఇటీవల ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ ద్వారా మారిన సంగతి తెలిసిందే. గోవా తరఫున ఆడుతున్న అర్జున్ ఫాస్ట్ బౌలర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. 2022లో రంజీ ట్రోఫీలో గోవా తరఫున అరంగేట్రంలోనే శతకం బాదడం విశేషం. తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన తన తండ్రి సచిన్ ఘనతను అర్జున్ తిరిగరాశాడు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో మ్యాచ్.. అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు: పాక్ ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు

టీ20 ప్రపంచ కప్ 2026: సభ్య దేశాలను భయపెడుతున్న అసోసియేట్ జట్లు

Updated Date - Feb 10 , 2026 | 09:19 PM