Share News

అమెరికాపై పాక్ మళ్లీ ఓడుతుంది.. పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు వైరల్

ABN , Publish Date - Feb 10 , 2026 | 08:02 PM

టీ20 ప్రపంచ కప్‌ 2026లో గ్రూప్ ఏ పోరు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పాకిస్థాన్-అమెరికా కొలంబో వేదికగా తలపడుతున్నాయి. అయితే గతంలో పాక్ మాజీ క్రికెటర్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అమెరికాపై పాక్ మళ్లీ ఓడుతుంది.. పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు వైరల్
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ 2026లో గ్రూప్ ఏ పోరు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పాకిస్థాన్-అమెరికా కొలంబో వేదికగా తలపడుతున్నాయి. ఈ పోరు ఇరు జట్లకు చావో రేవో మ్యాచ్‌గా మారింది. ఆరంభ మ్యాచ్‌లోనే నెదర్లాండ్స్‌పై అతి కష్టం మీద గెలిచి తృటిలో ఓటమిని తప్పించుకున్న పాకిస్థాన్.. భారత్‌పై చివరి వరకూ పోరాడి ఓడిన అమెరికా జట్ల మధ్య సమరం ఉత్కంఠగా కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా సెమీస్ ఆశలపై తీవ్ర ప్రభావం పడనుంది.


ఇదిలా ఉండగా పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆసిఫ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘టీ20 ప్రపంచ కప్‌ 2026లో అమెరికా మళ్లీ పాకిస్థాన్‌ను ఓడిస్తుంది’ అని ఆసిఫ్ అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2024 ప్రపంచ కప్‌లో అమెరికా చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలసిందే. అమెరికా ధాటికి బాబర్ ఆజమ్ సేన గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో మ్యాచ్.. అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు: పాక్ ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు

టీ20 ప్రపంచ కప్ 2026: సభ్య దేశాలను భయపెడుతున్న అసోసియేట్ జట్లు

Updated Date - Feb 10 , 2026 | 08:02 PM