టీ20 ప్రపంచ కప్ 2026: చెలరేగిన కివీస్ ఓపెనర్లు.. యూఏఈపై అలవోక విజయం
ABN , Publish Date - Feb 10 , 2026 | 06:18 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 15.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 15.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది. కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్(84*; 50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), టిమ్ సీఫర్ట్(89*; 42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచారు. కివీస్ బ్యాటర్ల భారీ షాట్లకు యూఏఈ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ముహమ్మద్ వసీమ్(66*), అలీషాన్(55) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో హెన్రీ 2, డఫీ, ఫెర్గుసన్, శాంట్నర్ తలొక వికెట్ పడగొట్టారు. కాగా గ్రూప్ స్టేజిలో న్యూజిలాండ్‌కు ఇది రెండో విజయం.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో మ్యాచ్.. అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు: పాక్ ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు
టీ20 ప్రపంచ కప్ 2026: సభ్య దేశాలను భయపెడుతున్న అసోసియేట్ జట్లు