సచిన్ సహాచరుడిపై ఫైర్ అయిన యువరాజ్ సింగ్ తండ్రి! ఎందుకంటే..
ABN , Publish Date - Mar 25 , 2026 | 09:02 PM
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహచరుడు, భారత స్పిన్ కింగ్ రవిచంద్రన్ అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. తన కొడుకు సహచరులపై తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) సహచరుడు, భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే యోగ్‌రాజ్ అశ్విన్‌పై ఆగ్రహించడానికి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కారణం. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
2022లో యోగ్‌రాజ్(Yograj Singh) వద్ద అర్జున్ టెండ్కూలర్ శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందాడు. అలానే రంజీ ట్రోఫీలో గోవాకు మారి సత్తా చాటడం ప్రారంభించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో అర్జున్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అర్జున్‌కు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తుది జట్టులో చోటు లభించడంపై ఇటీవల అశ్విన్ కాస్త ఓపెన్‌గా మాట్లాడాడు. అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కడం అసాధ్యమని, అలానే ఒకవేళ చోటు దక్కినా అతడు రాణించడమే అని అన్నాడు. ఈ మాటలే యోగ్‌రాజ్‌ను చిర్రెత్తిపోయేలా చేశాయి. టీవీల్లో కూర్చొని ఒకరి ప్రతిభను డిసైడ్ చేయడానికి నువ్వ ఎవరు.. నీ అర్హత ఏంటి అంటూ ఘాటుగా స్పందించాడు.
ఒక ప్లేయర్‌ను.. నువు చేయలేవు, నీవు ఆడలేవు, నీకు ఇది సాధ్యం కాదు అని మాట్లాడటం సరైంది కాదంటూ అశ్విన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నిరుత్సాహ పరిచే ఇలాంటి మాటలు ఏ ఆటగాడిపై అయినా ఒత్తిడి పెంచుతుందని అన్నాడు. సచిన్ కొడుకు కావడం అర్జున్‌పై ముందు నుంచే ఒత్తిడి ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు అతన్ని మరింత ఒత్తిడిలోకి నెడతాయని యోగ్‌రాజ్ తెలిపాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అర్జున్‌కు(Arjun Tendulkar) తప్పక అవకాశాలు వస్తాయని, వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
ధురంధర్ 2 మూవీపై పాక్ మాజీ క్రికెటర్ రియాక్షన్ ఇదే!
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!