Share News

ధురంధర్ 2 మూవీపై పాక్ మాజీ క్రికెటర్ రియాక్షన్ ఇదే!

ABN , Publish Date - Mar 25 , 2026 | 07:53 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ సినిమా గురించి స్పందించినట్లుగా ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది

ధురంధర్ 2 మూవీపై పాక్ మాజీ క్రికెటర్ రియాక్షన్ ఇదే!
Shahid Afridi

స్పోర్ట్స్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్.. గూఢచారి వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ.. రణవీర్ సింగ్ అద్భుత నటన, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ సినిమాపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా ఈ సినిమా గురించి స్పందించినట్లుగా ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ధురంధర్ 2 చిత్రం చూసిన తర్వాత పాకిస్థాన్ లో ఎవరిని నమ్మలేని పరిస్థితి ఉందని అఫ్రిది కామెంట్ చేసినట్లు ఓ పోస్ట్ చక్కర్లు కొడుతుంది.


ధురంధర్ 2 సినిమా చూసిన తర్వాత పాకిస్థాన్‌లో ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తోందని ఆఫ్రిది ఆ పోస్టులో పేర్కొన్నారు. ఒకప్పుడు తాను ఎవరితోనైనా త్వరగా మాట్లాడుతానని, కానీ ధురంధర్ 2 చూసిన తర్వాత ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఇప్పుడు వందసార్లు ఆలోచిస్తున్నానని తెలిపాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి భారత గూఢచారి ఏమో అన్న అనుమానం తనను వెంటాడుతోందని అఫ్రిది ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ప్రముఖులే కాకుండా రోడ్డు పక్కన ఉండే భిక్షగాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరినీ పాకిస్థాన్ ప్రభుత్వం క్షుణ్ణంగా విచారించాలని, వారిలో భారత ఏజెంట్లు ఉన్నారేమో తేల్చాలని అఫ్రిది వింత ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడని సమాచారం.


ఇదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పనితీరుపై కూడా షాహిద్ అఫ్రిది తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్ వంటి చిన్న జట్ల చేతిలో సిరీస్ ఓడిపోవడంపై అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెలక్షన్ కమిటీకి కనీస అవగాహన లేదని.. ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్ చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారని విమర్శించాడు. తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని వన్డే కెప్టెన్ గా ఎంపిక చేయడంపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశీ క్రికెట్లో అనుభవం లేని కుర్రాళ్లకు జాతీయ జట్టులో చోటు కల్పించడం వల్లే పాక్ క్రికెట్ పతనమవుతుందంటూ ఆఫ్రిది మండిపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 25 , 2026 | 07:57 PM