Share News

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:42 PM

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ డైలాగ్‌తో ఉన్న మీమ్‌ను టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్
Sanjana Ganesan viral post

స్పోర్ట్స్ డెస్క్: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నెటిజన్లు ఈ సినిమాలోని ప్రతి సీన్ గురించి, క్యారెక్టర్ల గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సన్నీవేశం అయితే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో హీరోను చూసిన ఒకరు 'ఇంటికి రావాలనిపించలేదా జస్సీ?' అని అడుగుతాడు. తాజాగా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా ఈ డైలాగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ డైలాగ్‌తో బుమ్రా(Jasprit Bumrah)కు ఆమె పంచ్ ఇచ్చింది. ప్రస్తుతం సంజనా చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సంజనా ఈ ఫన్నీ మీమ్ షేర్ చేసి.. పెళ్లైన తర్వాత మగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సరదాగా చెప్పింది. ఎప్పుడైనా బుమ్రా తన ఫ్రెండ్స్‌తో కలిసి బాయ్స్ నైట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారీ అతనికి ఎదురయ్యే పరిస్థితిని ఈ మీమ్‌తో పోల్చింది. ధురంధర్ 2 సినిమాలో పిండా పాత్ర చేసిన ఉదయ్‌బీర్ సంధుకు ఒక విగ్గు పెట్టి మరీ ఈ మీమ్ క్రియేట్ చేసింది. జస్‌ప్రీత్ బాయ్స్ నైట్ ప్లాన్ చేద్దాం అనుకున్న ప్రతిసారీ.. నీకు ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ? అని తాను చెప్పినట్లు సంజనా అందులో రాసుకొచ్చింది.


తన భర్త ఎప్పుడైనా ఇల్లు వదిలి ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్ ప్లాన్ చేస్తే, తాను ఈ డైలాగ్‌తోనే సెటైర్ వేస్తానని సంజనా నవ్వుతున్న ఎమోజీలతో ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక సోషల్ మీడియా యూజర్ కూడా ఈ డైలాగ్‌తో కూడిన రీల్‌ను షేర్ చేశాడు. ఆ వీడియోలో సదరు వ్యక్తి దీపికా పదుకొణె, అలియా భట్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, రష్మిక మందన్న, కరీనా కపూర్, కత్రినా కైఫ్ వంటి హీరోయిన్లను అనుకరిస్తూ, ఒకే డైలాగ్‌ను విభిన్నమైన హావభావాలతో తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

పంత్ ఆట తీరు మారాలి.. లేకుంటే కష్టమే: ఆకాశ్ చోప్రా

కావ్యపాపకు పోటీగా ఆర్సీబీ నుంచి అందాల తార!

Updated Date - Mar 25 , 2026 | 05:46 PM