అర్జున్ ఐపీఎల్ అరంగేట్రంపై సచిన్ ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - May 24 , 2026 | 11:20 AM
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మైదానంలో కుమారుడిని చూసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి గురయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎల్ఎస్‌జీ జట్టు తరఫున అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో మైదానంలో కుమారుడిని చూసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పెట్టారు.
ఐపీఎల్ అరంగ్రేటం మ్యాచ్‌లోనే అర్జున్ అద్భుత ప్రదర్శన చేయడంపై సచిన్ సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కువ అవకాశాలు రాకపోయినా ఓపికగా, సానుకూలంగా ఉన్నందుకు అతడిని అభినందించారు. 'బాగా ఆడావు అర్జున్.. ఈ సీజన్ మొత్తం ఎంతో ఓపికగా ఉన్నావు. ఎల్లప్పుడూ నీ సామర్థ్యాన్ని నమ్మి.. నిశ్శబ్దంగా కష్టపడ్డావు. చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం వేచి ఉండాల్సి వచ్చినప్పటికీ సానుకూలంగా ఉండటం నాకు గర్వంగా ఉంది. క్రికెట్ అనేది నైపుణ్యంతో పాటు సహనాన్ని కూడా పరీక్షిస్తుంది. ఈరోజు నీవు ఆ రెండింటినీ అద్భుతంగా నిర్వహించావు. వాస్తవికతను కోల్పోకు, ఎప్పటిలాగే ఆటను ప్రేమించడం కొనసాగించు. నిన్ను ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ సచిన్ ఎమోషలన్ పోస్ట్ చేశారు.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎల్‌ఎస్‌జీ నిష్క్రమించడంతో, సీజన్‌లో వారి చివరి లీగ్ మ్యాచ్‌లో అర్జున్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెర్సీతో అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగాడు. 4 ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి ఓ కీలక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ ఆఖరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్
ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..