మేజర్ అభిలాష బరాక్‌కు యూఎన్ పురస్కారం
ABN , Publish Date - May 24 , 2026 | 04:39 AM
భారత సైన్యానికి చెందిన మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్- 2025’ అవార్డుకు ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ, మే 23: భారత సైన్యానికి చెందిన మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్- 2025’ అవార్డుకు ఎంపికయ్యారు. లెబనాన్‌లోని యూఎన్ శాంతి పరిరక్షక మిషన్‌లో కమాండర్‌గా ఆమె చేసిన సేవలకు, అలాగే మహిళలు, బాలికల సాధికారత కోసం చేసిన కృషికి గానూ ఈ పురస్కారం లభించింది. ఐక్యరాజ్యసమితి 2016లో ఈ అవార్డును ప్రారంభించగా, ఇప్పటివరకు ఈ గౌరవాన్ని దక్కించుక్ను మూడో భారతీయ సైనికాధికారిగా మేజర్ అభిలాష నిలిచారు. 2019లో మేజర్ సుమన్ గవానీ (దక్షిణ సూడాన్ మిషన్), 2023లో మేజర్ రాధికా సేన్ (కాంగో మిషన్) ఈ అవార్డును అందుకున్నారు. మేజర్ అభిలాష భారత సైన్యంలోనే తొలి మహిళా కంబాట్ హెలికాప్టర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు.