Share News

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

ABN , Publish Date - May 24 , 2026 | 07:33 AM

ఐపీఎల్‌ 2026 సీజన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. శనివారం ఏకానా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎల్ఎస్‌జీ పరాజయం పాలైంది. అయితే లఖ్‌నవూ బౌలర్...

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..
Mohammed Shami IPL record

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026 సీజన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. శనివారం ఏకానా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎల్ఎస్‌జీ పరాజయం పాలైంది. లఖ్‌నవూ విధించిన 197 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మాత్రం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ చరిత్ర సృష్టించాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో తొలి బంతికే యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యను షమీ పెవిలీయన్ చేర్చాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో మహమ్మద్ షమీ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీయడం ఇది 6వ సారి. ఇప్పటివరకు 5 సార్లు తొలి బంతికి వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్‌(రాజస్థాన్ రాయల్స్)ను షమీ అధిగమించాడు. ఓవ‌రాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన షమీ 12 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ వెట‌ర‌న్ పేస‌ర్ సీజ‌న్ ఆరంభంలో మెరుగ్గా రాణించిన‌ప్పటికి, త‌ర్వాత మాత్రం త‌న రిథ‌మ్‌ను కోల్పోయాడు.


ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది, ఇంగ్లాండ్ పేసర్ ల్యూక్ వుడ్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ఒక ఇన్నింగ్స్ మొదటి బంతికి అత్యధికంగా తొమ్మిది వికెట్లు తీశారు. వారి తర్వాత డేవిడ్ విల్లీ ఎనిమిది వికెట్లతో, ట్రెంట్ బౌల్ట్ ఏడు వికెట్లతో, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ అమీర్, షమీ, డిర్క్ నాన్స్, సోహైల్ తన్వీర్ తలా ఆరు వికెట్లతో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

పంజాబ్‌ నిలిచె..

అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ.. ఎందుకంటే?

Updated Date - May 24 , 2026 | 07:43 AM