అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ.. ఎందుకంటే?
ABN , Publish Date - May 23 , 2026 | 06:14 PM
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో విడుదల చేశాడు. అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఎంఐ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ముంబై జట్టు బస చేసే హోటల్ దగ్గర ప్లేయర్లను చూడాలని వందలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ రద్దీలో రోహిత్ శర్మను చూడటానికి ఓ చిన్న అమ్మాయి కూడా ఎదురుచూస్తూ ఉంది. అయితే భారీ జనం, భద్రతా కారణాల దృష్ట్యా రోహిత్ శర్మ ఆమెను గమనించకుండానే ముందుకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అమ్మాయి ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది రోహిత్ శర్మ వరకు వెళ్లింది. దీంతో క్షమాపణ కోరుతూ హిట్‌మ్యాన్ ఓ స్పెషల్ వీడియో విడుదల చేశాడు.
‘నన్ను క్షమించు.. ఆ సమయంలో ఈడెన్ గార్డెన్స్‌లో నిన్ను కలవలేకపోయాను. నేను నీ వీడియో చూశాను. మైదానం వెలువల, హోటల్ వద్ద రద్దీ, గందరగోళం ఉంటుంది. అందుకే నా దృష్టి నీపై పడలేదు. కానీ నీకు ఇప్పుడు మాటిస్తున్నాను.. మళ్లీ కోల్‌కతా వచ్చినప్పుడు కచ్చితంగా నిన్ను కలుస్తాను’ అని రోహిత్ శర్మ ఆ వీడియోలో వెల్లడించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘అంతర్జాతీయ స్థాయి ప్లేయర్.. ఓ అభిమాని కోసం ఇలా సమయం కేటాయించి క్షమాపణ కోరడం చిన్న విషయం కాదు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఇలా!
షేక్‌హ్యాండ్ వివాదం.. కోహ్లీ అలా చేసి ఉండకూడదు: ఇర్ఫాన్ పఠాన్