షేక్‌హ్యాండ్ వివాదం.. కోహ్లీ అలా చేసి ఉండకూడదు: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - May 23 , 2026 | 02:46 PM
ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్.. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ సందర్భంగా ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్.. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘కోహ్లీ కూడా ఆస్ట్రేలియా ప్లేయర్ల తరహాలోనే దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతాడు. మ్యాచ్ సమయంలో విరాట్, హెడ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. హెడ్ మ్యాచ్ మధ్యలో కోహ్లీని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. విరాట్ కూడా దీనిపై ఘాటుగా స్పందించాడు. అయితే అప్పటితోనే ఆ వివాదం ముగిసిందని భావించా. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ ప్లేయర్లకు షేక్‌హ్యాండ్ ఇస్తూ వచ్చిన విరాట్.. హెడ్‌కు మాత్రం ఇవ్వలేదు. మ్యాచ్ సమయంలో ఒక ప్లేయర్ అగ్రెషన్‌గా ఉండటం సహజమే. కానీ షేక్‌హ్యాండ్ విషయంలో మాత్రం కోహ్లీ అలా చేసి ఉండకూడదు. అందరికీ కరచాలనం చేస్తూ వస్తున్నప్పుడు హెడ్‌కు కూడా ఇచ్చేస్తే అక్కడితో ఆ వివాదం ముగిసేది’ అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఉప్పల్ వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ జట్లు చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడేశాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 255 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ 200 పరుగులకే పరిమితమైంది. ఇందులో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మధ్యలోనే విరాట్, హెడ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ‘భారీ షాట్లు కొట్టు..’ అంటూ కోహ్లీని రెచ్చగొట్టేలా హెడ్ వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. కోహ్లీ కూడా ఘాటుగా స్పందిస్తూ.. ‘నువ్వు వచ్చి ఆఫ్ స్పిన్ వేయ్.. అప్పుడు భారీ షాట్లు కొడతా. అయినా నువ్వు ఎప్పుడూ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తావు కదా’ అంటూ ఫైరయ్యాడు. ఆ తర్వాత కరచాలనం చేస్తున్నప్పుడు విరాట్.. హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్‌ను అవమానించిన విరాట్ కోహ్లీ !
చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ యువ పేసర్